పుట:Ganapati (novel).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

గ ణ ప తి

కివి రోజులు కావు. పిల్లవానిని బాగుచేసినా నని విశ్వాసము లేదు. సరిగదా మీదు మిక్కిలి దెబ్బలాటలకు వచ్చినారా, నా మీఁదికి? మీ పిల్లవాఁడు నా బడిలోనికి రానేవద్దు. తీసుకొని పొండి. పోరా వెధవా! యని లేవగొట్టెను. ఒక పిల్లవాఁడు రెండుదినములు బడికి రాక మూడవదినమున వచ్చినందుకు గణపతి వానికి బుద్ధివచ్చుటకై జుట్టుకు త్రాడువోసి వానిని దూలమునకు గట్టెను. ప్రాతచేఁదత్రా డగుటచే వెంటనే తెగిపోయెను. పిల్లవాఁడు క్రిందపడెను. ఆ పాటున నొడ లెల్ల గాయము లయ్యెను. దెబ్బ తగులక పోయినను తగిలిన ట్లేడ్చుచున్నావా దొంగ వెధవా!" యని పైగా బెత్తముతో రెండు వడ్డించెను. వాఁడు గోలపెట్టి పెద్దపెట్టున నేడువసాగెను. పదుగురు బడిచుట్టు జేరిరి. "దయా దాక్షిణ్యము లేక పశువును గొట్టిన ట్లీ విధమున గొట్టవచ్చునటయ్యా! యని కొందరయ్యలు గణపతిని బ్రశ్నింప గణపతి యాక్షేపణ పూర్వకముగ వారి కిట్లనియె. "కుండలో కూడు కుండలో నుండవలె, పిల్లవాడు దుండుముక్క వలె నుండవలె నన్నారఁట" వెనకటికి ! మీ మాట లాలాగున నున్నాయి. బెత్తము దాచినానా పిల్లవాఁడు చెడిపోయినాడన్న మాటే. ఈలాగున చిత్రవధ చేయుచున్నప్పుడే యీ విధవ లింత పొగరెక్కినారు. నేనూరకుంటినంటే వీళ్ళ ముందర లోకా లాగుతాయా! అతికాయుఁడు మహాకాయుఁడు వంటివాళ్ళీ వెధవలు. ఈ మాత్రమునకే మీరీలాగున భయపడుచున్నారు. నా చిన్న