పుట:Ganapati (novel).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

265

మన గ్రామములో నిలపండి. ఈలా గిచ్చినందువల్ల రెండు విశేషము లున్నవి. ముందుగా బ్రాహ్మణునకు సహాయము చేసెడు వల్ల గలిగెడు పుణ్య మొకటి, మన పిల్లలకు విద్య వచ్చుట యొకటి. అందుచేత స్వలాభ మాలోచించుకొని గాని పుణ్యము వచ్చునని కాని మన మీ సాయము చేయవచ్చును. 'బ్రాహ్మణున కిచ్చుట యనఁగా మనము ముందు జన్మమునకు దాఁచికొనుట ' అని యుపదేశించుటయు నచ్చట చేరిన వారందరు యధాశక్తిగ ధాన్య మిచ్చిరి. మహాదేవశాస్త్రి మాత్రము తన రెండు కుంచముల ధాన్య మీయలేదు. కాని మాటసాయము చేసి యిప్పించి నందుకు మనము సంతసింపవలెను. మాతాపుత్రులయొక్క భోజన ప్రమాణము వారి యాకారములకు వయస్సునకుఁ దగని దగుటచే పదికుంచముల ధాన్యము దంపుకోగా వచ్చిన బియ్య మైదు కుంచములు పదిపన్నెండు దినములలోనె యైపోయెను. భోజనము నిమిత్తమే గాక వారికి గావలసిన సమస్త వస్తువులు గొనుటకు బియ్యమే యుపయోగ పడుచుండెను. ఉప్పు మిరపకాయ చింతపండు మొదలగునవి యెల్ల బియ్య మిచ్చియే కొనవలసి యుండెను. అదిగాక చిరుతిండి తినుటలో గణపతియు తల్లియు నొకరి కొకరు తీసిపోరు. ఈతపండు రేఁగుపండు చెరుకు ముక్కలు నేరేడుపండ్లు మామితాండ్ర తాటిచాప కొబ్బరి కురిడీలు మొదలగున వేవి వీధిలోనికి వచ్చినను తల్లి యరసోలెడు బియ్యము బోసి కొని తిని తీరవలయును. ఈ విధముగ