పుట:Ganapati (novel).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

గ ణ ప తి

దూరమై దేశాలపాలై దిక్కుమాలిన పక్షినై పోవలసివచ్చినది. మా సంగతి కొంచెము కనుక్కో నాయనా ? అన్నింటికి నీవే మా "కని యేడ్చి బండియెక్కి పోయెను. గణపతి వానపల్లి పొలిమేరవద్ద కెదురుగ వచ్చి బండి తోలించుకొని మహాదేవశాస్త్రి గారి యింటి కరిగి సామాను దింపించి వారి పడమటింటి వెనుక పంచపాళిలో పెట్టించెను. మహాదేవశాస్త్రి వెనుక పంచపాళి వారికి బసగ నిచ్చెను. సన్యాసి పెండ్లికి జుట్టుదగ్గరనుంచి యెరువన్నట్లు గణపతియొక్క సంసారమునకు వండికొను కుండ దగ్గర నుంచి యెరువె. వంటకు రెండు మూడు కుండలు దాకలు మూకుళ్లు కొనుటకయిన వారి దగ్గర డబ్బులు లేవు. బండి కిరాయి పుల్లయ్య యిచ్చినందున వారు సామాను తెచ్చుకోగలిగిరి. మహాదేవశాస్త్రి వారి పేదస్థితి నెరిఁగి రెండు మూడు కుండలు తెప్పించి వారి కిచ్చి మరునా డుదయమున తనకు మిత్రులయిన బ్రాహ్మణులను గాపులను జేరబిలిచి యిట్లనియెను. "ఈ గణపతిగారు మన గ్రామములో బడి పెట్టదలఁచు కొన్నారు. అలాగున పెట్టుమని నేనే బలవంతం పెట్టినాను. మన గ్రామములో బడి లేక పోవుటచేత మన పిల్లలు చెడిపోవుచున్నారు. ఈయన చాలా పేదవాడు. అందుచేత మన మందరము ముందుగ గణపతి గారికి కావలసిన ధాన్య మీయవలెను. నా మట్టుకు నేను రెండుకుంచాల ధాన్య మిచ్చెదను. మీ రందఱు తల కొక కుంచెడు రెండుకుంచములు నిచ్చి పాప మా పేద బ్రాహ్మణుని