పుట:Ganapati (novel).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

259

రుఁడును, నివాతకాలకేయాది దానవులను నిర్జించిన మహాధనుర్ధరుడును, ముక్కంటిని గెలిచి పాశుపత మహాస్త్రమును గైకొన్న బాహుశాలియు, గాండీవ మను తెప్పచేత కౌరవసేనాసముద్రము నీఁదిన మేటికోవిదుఁడును, తాను మూర్ధాభిషిక్తుఁడు గాకున్నను దేవేంద్రుని యనుగ్రహమునఁ గిరీటంబు సంపాదించి కిరీటి యను సార్థక నామము బడసిన విఖ్యాతుఁడును నగు పాండవమధ్యముఁడర్జునుఁడు వాసుదేవుని చెలియలగు సుభద్ర నెట్లు వివాహమాడె? శ్రీకృష్ణ బలరాములుం దక్కిన యాదవులు నింటలేని సమయంబున సుభద్రను దొంగతనముగా దీసికొనిపోవలేదా? తన మార్గము నవరోధించిన యాదవులను దండింపలేదా? కురుకుల శిఖామణి యని చెప్పదగిన దుష్యంతుడు కణ్వమహాముని యాశ్రమముజేరి, మాయలు మర్మము లెరుఁగని శకుంతలను మచ్చికచేసి; యిచ్చకములాడి మనసు మెత్తపరచి, పెంపుడుతండ్రి యింటలేని తరి నామెను జేపట్టలేదే? అవి యెవ్వ రెరుంగని రహస్యములు? ఈ పురాణపురుషుల మాట యటుండనిచ్చి సామాన్యుల విషయ మించుక విచారింతము. వత్సదేశముల కధీశ్వరుండైన యుదయనమహారా జొకానొక కారణంబున నుజ్జయినీ పురాధీశ్వరుండైన ప్రద్యోతన మహారాజు నింటఁ గొంత కాలముండి యాతని కూతుఁ రగు వాసవదత్తకు గానము నేర్పుటకై యామె తండ్రిచేత నియుక్తుడై, రాగములు నేర్పుటకు మారుగా ననురాగంబు నేర్పి యెట్టకేలకు నామెను దన