పుట:Ganapati (novel).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

253

అత డాలా గనుచుండ గంగమ్మ కంట దడిపెట్టుకొని గద్గద స్వరముతో నిట్లనియె. "ఒక్కగా నొక్క పిల్లగదమ్మా! అచ్చటా ముచ్చటా దీనివల్ల మాకు తీరు ననుకొన్నాము. సుఖముగా మే మిద్దరము పీఠలమీఁద గూర్చుండి చేతులార బిడ్డను కన్యాదానము చేయవలె ననుకొన్నాము. ఇంతలో మాయచచ్చినాఁడు మారీచుడు లాగ వచ్చి వాడి పెండ్లి పెడాకులుగాను వాడి దుంప తెగిపోను! వాడి కల్యాణం నేలబడ ! నా పిల్లకోసం నేను నిన్న రాత్రి యేడ్చినట్లు వాడితల్లి వాడికోసం యెప్పుడేడ్చునో, వాడి గూనె దింప; వాడి తల్లికడుపు మాడ, వాడింట పీనుగు వెళ్ళ, మా కండ్లలో దుమ్ముపోసి మాణిక్యములాగు ఆడుకొనుచున్న దానిని యెత్తుకొనిపోయి పుస్తెకట్టినడమ్మా. వీడి తాడు కోటిపల్లిరేవులో పుటుకు పటుక్కున తెంప! వాడి పిండాకూడు పిల్లులు తినిపోను. వాడి వంశము నిర్వంశముగాను. అంతంత మాటలడకూడ దంటారేమో మీరు. మేము వాడిచేత వాడి తల్లిచేత మహాకష్టాలు పడిపడి యున్నాము. అందుచేత నా ప్రాణం విసిగిపోయింది. ఆ చండాలపు ముండాకొడుకు నే మన్నప్పటికి తప్పు లేదు."

అనుచు గంగమ్మ గంగాప్రవాహమువంటి శాపపరంపరను నోటనుండి వెలివరచుచుండ నాగన్న తన తిట్ల చేత నామె తిట్లకు వన్నెపెట్టుచు గొంతు బొంగుబోవునట్లు మేనల్లుని చంపుదు నని తోడబుట్టిన పడుచుని జంపివేయుదు నని