పుట:Ganapati (novel).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

గ ణ ప తి

మూలుగానే యెవరికీ వినబడలేదు. ఏడ్చి, యేడ్చి పిల్ల నేలఁ బండుకొని నిద్రపోయెను. కదిపినయెడల మరల లేచి గోలసేయునేమో యను భయమున దానిని లేపక పండుకొని యుండగానే గణపతిచేత మహాదేవశాస్త్రి మంగళసూత్రములు కట్టించెను. నిద్రించుచుండగా గణపతి బుచ్చమ్మ తలమీద తలంబ్రాలు పోసెను. కాని బుచ్చమ్మ తలంబ్రాలు తనమీద పోయునట్టి భాగ్య మబ్బలేదని యతఁడు విచారించెను. ఏలాగో యొకలాగున వివాహమయ్యెను. మూడు పోచలు జందెము వదలిపోయి దూడకన్నెవంటి పెద్దయజ్ఞోపవీతము మెడలోఁ బడెను. మంగళస్నానము చేయించినట్లు కనబడ దేమని పూజారి ప్రశ్నవేయగా మహాదేవశాస్త్రి "మా యింటిదగ్గఱ మంగళస్నానములు చేయించి తీసికొని వచ్చినామయ్యా ! మంగళస్నానములు లేకుండ నేను వివాహము సేయింతునా?" యని యతడు తిరస్కారభావముగా బలికెను. " జడ జడపాళముగానే యున్నదే, మంగళ స్నానము లెట్లు చేయించితి" వని యతఁడు మరఁల బ్రశ్న వేయగా "జడ విప్పకుండగనె చేయించితి" నని బదులు చెప్పియతని రెండు రూపాయ లతనికిప్పించి, ఫలప్రదానము విశిష్టాద్వైత తాంబూల మతని కిప్పించి వాగ్భంధము చేయించెను. వివాహము సంపూర్ణమయ్యెను. బాలిక నడుమ నడుమ "అమ్మా !" యని యేడ్చుచు మరల నిద్రావశమునఁ గన్నులు మూయుచుండెను. బిడ్డను భుజముమీఁద బెట్టుకొని పుల్లయ్య మహా