పుట:Ganapati (novel).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

245

అందు కెవరినైన గుదిర్చితివా లేదా?" యని యడిగెను. 'నీవు మరచిపోయినావు గాని నాకా మాట జ్ఞాపక మున్నది. కన్యధార పోయుటకు దంపతులను సిద్ధము చేసి యుంచినా? నని యతఁడు బదులుచెప్పెను. 'వహవ్వా ! మహాదేవశాస్త్రి యంటే సామాన్యుఁడా? బృహస్పతి వంటివాడఁవు నీ వుండగా మాకు లోటు జరుగునా? ఇంతకూ మీరు పెట్టిన ముహూర్తము మంచిది. ముహూర్త బలిమిచేతఁ బిల్ల దొరికినది గాని, లేకపోతే సామాన్యముగా దొరకునా? కాని, కన్యాప్రదానమునకు సిద్దమైన దంపతు లెవరు?" అని పుల్లయ్య యడిగెను. మహాదేవశాస్త్రి యిట్లనియె.

"ఎవరేమిటి? మా గ్రామములో మంగళంపల్లి నర్సయ్య యనే యొక బ్రాహ్మణు డున్నాఁడు. ఆయనది కృష్ణాతీరము కాపురము. మునుపు కొన్నా ళ్ళమలాపురములో నీళ్లకావళ్ళు మోసినాఁడు. అక్క డుండఁగా నరసాపురము నుంచి బ్రాహ్మణ వితంతు నొకర్తె లేచివచ్చినది. అది తలవెండ్రుకల విధవ; అమలాపురములో నున్నప్పుడే దానిని వీ డుంచుకొన్నాఁడు. దానికి కొంత కాలమునకు కడుపైనది. బిడ్డను చంపివేయుట కిష్టములేక, ఆ గ్రామము విడిచి దంపతుల మని చెప్పుకొని వారిక్కడఁ బ్రవేశించిరి. ఆబిడ విధవా రూపముం దీసివైచి పసుపు రాసుకొని కుంకుమబొట్టు పెట్టుకొన నారంభించినది. వాళ్ళ కిప్పుడిద్దరు పిల్ల లున్నారు. వారు దంపతులే యని మేముకూడ