పుట:Ganapati (novel).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

243

జరుగును గావున నాగన్న స్వగృహమందు వివాహ ప్రయత్న మేమియుఁ జేయనక్కర లేకపోయెను. అప్పడములు వడియములు పెట్టించుట యరిసెలు వండించుట యటుకులు కొట్టించుట పందిళ్లు పాకలు వేయించుట మొదలగు సమస్త ప్రయత్నములు రాయప్ప తన పినతల్లి యొక్కయుఁ బినతండ్రియొక్కయు పెత్తనము క్రిందఁ జేయించెను. నాగన్న పుత్రికను, భార్యను దీసికొని మాఘ శుద్ధ సప్తమినాఁడు పలివెల వెళ్ళ నిశ్చయించెను. పెండ్లికూతురైన బుచ్చమ్మ నాలుగేండ్ల పిల్ల యగుటచే లక్కపిడతలు లక్కబొమ్మలు కఱ్ఱబొమ్మలు మొదలగునవి తీసికొని, కందిపప్పు, బెల్లపుముక్క మొదలగు నవి పట్టుకొని తన యీడు పిల్లలతో తఱుచుగా నాడుకొనుటకుఁ బోవుచుండును. షష్టినాడు సాయంకాల మా బాలిక పుల్లయ్యగారి యింటిప్రక్క నున్న యొక బ్రాహ్మణ గృహమున నాడుకొని నాలుగుగడియల ప్రొద్దువేళ మరల నింటికి బోవుచుండెను. ఆ బాలిక యొక్క రాకపోకలను మిక్కిలి జాగరూకతతోఁ గనిపెట్టుచుండిన పుల్లయ్య యామె యొంటిగాఁ బోవుచుండుటఁ జూచి యదివఱకే తాను గొని యుంచిన కర్జూరపుపండు పొట్లము విప్పి యామె చేతికిచ్చి "అమ్మాయి ! ఈ పండు తిను. మా యింటికిరా! ఆడుకొందువుగాని" యని యెత్తుకొని ముద్దుబెట్టుకొనెను. బుచ్చమ్మ ఖర్జూరపుపండుయొక్క యెరలోఁ బడి యది తినుచు మాటాడక యూరకుండెను. పుల్లయ్య యాబిడ్డ నెత్తుకొని "అమ్మాయి!