పుట:Ganapati (novel).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

గ ణ ప తి

యని బహూకరించెను. "మామా ! ఇది నీ చలవ గాని నా ప్రజ్ఞ యేమున్నది? నన్నొక యింటివానిం జేసినాడన్న ప్రజ్ఞ నీకు దక్కవలసియున్నది. నా మేనమామ బ్రతికి యున్నప్పటికిఁ జచ్చినవారిలో జమ. నీవే నా మేనమామవు" అని గణపతి ప్రత్యుత్తర మిచ్చెను. అనవుడు " పంచమి యెల్లుండేకదా! యెల్లుండి వుదయమున నీవు నా దగ్గరకు రా! ఉత్తరము వ్రాసి యిచ్చెదను. అది పుచ్చుకొని మహాదేవశాస్త్రి దగ్గరకు వెళ్ళుదువుగాని; వివాహ మగువరకు నీ వక్కడనే యుండవలెను. జాగ్రత్తసుమా! నోరుజారి ఎవరితోనైన రహస్యము బయలు పెట్టెదవేమో?" యని హెచ్చరించి పుల్లయ్య వాని నంపెను. గణపతి పరమసంతోషముతో నింటికిఁ బోయి మరునా డుదయమున వానపల్లి కరిగెను. బుచ్చమ్మ పెండ్లి పలివెలలో శ్రీ కొప్పులింగేశ్వ సామివారి యాలయములోఁ జేయవలె నని నాగన్న తలంచెను. గాని, రాయప్ప దేవాలయములోఁ జేసికొన్న వివాహము వలన వధూవరులకు ముచ్చటలు తీరవని గుడిలో పెండ్లి వల్లకా దనియు నైదుదినములు యథావిథిగ వివాహము జేయవలసినదనియు వ్యయ మంతయు, దానే చేయుదు ననియు నాగన్నయొక్కయత్తమామలతోఁ జెప్పి వారి నొడంబరచెను. అత్తమామ లొప్పుకొనగానే నాగన్నయు నొప్పుకొనెను. పుట్టింటనే తన కూతురు వివాహము జరుగుచున్నప్పుడు గంగమ్మ నిరుపమానందముతో నొప్పుకొన్న దని వేరుగా వ్రాయనక్కఱ లేదుకదా! పలివెలలోనె వివాహము