పుట:Ganapati (novel).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

241

షష్టినాడు తీసికొనివచ్చెదను. సప్తమినాఁడు వీలైతే సప్తమినాడు తీసికొనివచ్చెదను. అందుచేత రెండు రోజులకు గూడ ముహూర్తములు పెట్టి మీ రుంచవలెను. నే నుత్తరము వ్రాసి యిచ్చి, పెండ్లికొడుకును మీ యింటికి పంచమినాడే పంపెదను. అతనికి మీ యింటిలోనే భోజనము పెట్టండి. దేవాలయములో రాత్రి వివాహములు చేయఁగూడ దని పెద్దలన్నారు. మీరు రాత్రి ముహూర్తము పెట్టినారేమి?" అని పలికెను. "రాత్రులు దేవాలయములో వివాహము చేయఁగూడ దని నే నెరింగినంతవర కే శాస్త్రములోనూ లేదు. అందుచేతనే రాత్రి ముహూర్తము పెట్టినాను. ఇటువంటి పిచ్చిపిచ్చి సందేహములు పెట్టుకొనక పిల్లను తీసికొనిరా! మూడు నిమిషములలో వివాహము చేయించెద" నని మహాదేవశాస్త్రి బదులు చెప్పెను. పుల్లయ్య సంతుష్టుడై వానపల్లి విడిచి స్వగ్రామమునముఁ బోయెను. అతడు వచ్చునప్పటికి గణపతి వాని వీథియరుఁగుమీఁద గూర్చుండెను. గణపతిం జూచి పుల్లయ్య మీఁదఁ జేయివైచి తట్టి "గణపతీ! నీ వదృష్టవంతుడవురా! నీ పేరుఫల మేమో గాని యెక్కడికి వెళ్ళితే అక్కడ దిగ్విజయమే. పురోహితుఁడు కుదిరినాఁడు. పూజారి యనుకూలముగా నున్నాడు. సమస్తము నేటివరకు శుభముగానే యున్నది. నీకు తప్పక కళ్యాణకాలము వచ్చినట్లు కనఁబడుచున్నది. కక్కు వచ్చినప్పుడు, కళ్యాణము వచ్చినప్పుడు ఆగదన్నారు, పెద్దలు. ఇంతకు నీ దినములు మంచివి