పుట:Ganapati (novel).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

229

లెను. నాకు నీవు నాలుగువందల రూపాయ లియ్యగలవా, పిల్లమీద ? బుఱ్ఱ గొరిగించుకొనేందుకు గూడ యేగాణియైన దగ్గర లేక చిక్కుపడుచున్న ముండవు. నీవు నాలుగువందల రూపాయలు నాకిచ్చి పిల్లకు ముచ్చట తీరుటకు వందరూపాయలు నగలు పెట్టి పెండ్లి చేసికోగలవా? మేనల్లుడు గనుక తండ్రి చచ్చినప్పటి నుంచి అన్నవస్త్రము లిచ్చి పోషించినాను. నే నంతకన్న చేయవలసిన దేమీలేదు. నీ వేడ్చినప్పటికి మొత్తుకొన్నప్పటికి నేను పిల్ల నియ్యను."

అనవుడు సోదరి సొదరున కిట్లనియె. "అన్నయ్యా! యిల్లులేని మనుష్యులు భూమిలేని మనుష్యులు బ్రతుకటలేదా? చచ్చిపోయినారా? మనవాడుకదా, నాలుగూళ్లు తిరిగి ముష్టెత్తి భార్యను పోషించుకొనలేకపోవునా? లోకములో అందరికి భూములున్నవా? పుట్ర లున్నవా? గుణములు మంచివికా వన్నావు. చిన్నతనము కనుక అల్లరి చిల్లరగా తిరిగినాడే కాని పెద్దవాడైన తరువాత కూడ నీలాగే యుండునా? పై వేషాలే గాని గణపతి మనస్సంత మంచి మనస్సెవరిదిగాదు. వాడు జాలిగుండెవాఁడు. ఎంతో బుద్ధిమంతుఁడు. నీ పెండ్లాము మా మీద గిట్టక మమ్ము లేవగొట్టించవలె నని నీతో అయినప్పుడు కానప్పుడు కొండెములు చెప్పి నా మీద, మా అబ్బాయిమీద నీకు కోపము తెప్పించినది. దాని మందులు నీకు తలకెక్కినవి. దాని మాటలు పథ్యమైనవి. అది నా వుసురు పోసుకున్నది. నా వలెనే అదికూడా హోరున యెప్పు డేడ్చునో, దాని యాశ లెప్పుడడుగంటిపోవునో, దాని