పుట:Ganapati (novel).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

గ ణ ప తి

యుండుననియు నతఁడు తన్ను బ్రతిష్టింపఁ గోరినపుడు భయపడి వలదనఁజాలక యియ్యె కొనియెననియు నాకుం దోచుదున్నది. అంతకన్న శంకరుడు శనైశ్చరప్రతిష్ట నంగీకరించుటకు మఱియొక కారణ మగపడదు. ఆ మందపల్లియె మన కథానాయకుని పూర్వుల నివాసస్థానము. ఆ గ్రామమున మన గణపతి యిల్లిదియని యుద్దేశించి చెప్పుటకు వీలులేదు. అతని సంతతివా రుండిన పక్షమున మాపెద్దల స్థల మిదియిని యిల్లిది యని చెప్పుకొందురు. పప్పుభొట్లవారి వంశము బ్రహ్మచర్య దీక్షితుఁడై జీవనము వెళ్ళబుచ్చిన మన గణపతితో సమాప్తమైనందున గణపతి కక్క సెల్లెండ్రైనను లేమి దౌహిత్రుఁడుగూడ లేకపోవుటచేతను పప్పుభొట్ల వంశస్థులకు పరంపరగా నివాసమైన నివేశనస్థలమునిర్దేశించుట కవకాశము లేకపోయినది. అట్లు నిర్దేశింపఁగలిగిన పక్షమున మందపల్లి వెళ్ళిన దీర్థవాసు లందఱు మందేశ్వర స్వామివారి యాలయము జొచ్చి తరించిట్లే గణపతివారి గృహముకూడ ప్రవేశించి చూచి తరించుచుందురు గదా. ఆ యదృష్ట మాంధ్రదేశమునకు లేదు. గతించినవారికి విచారించిన ఫలమేమి? ఆ గ్రామమందున్న పాడు దిబ్బలలో నేదో యొక దిబ్బ పూర్వము గణపతి యిల్లయి యుండవచ్చును. కాదేని నేడు సకలసంపదలు కలిగి కలకలలాడుచున్న యిండ్లలో నొకటి మన కథానాయకునిదై యుండవచ్చును. గణపతికిఁ బూర్వు లేడు పురుషాంతరములవారు మందపల్లిలో