పుట:Ganapati (novel).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

గ ణ ప తి

నీ యన్న గారు ఎల్లవారివంటివాడు కాడు. ఎంతో మంచివాడు. నీ పెనిమిటి పోయినప్పటినుంచి, నిన్ను నీకొడుకును కడుపులో పెట్టుకొని ఆదరించి వేయి విధముల కనిపెట్టినాడు గదా" యని యొకతె, "ఏమి జూచుకొని పిల్ల నిమ్మనావమ్మా" యని మరి యొకతె, తోచిన భంగి పలుకఁజొచ్చిరి. ఆమె యేడుపు కొంత యణగిన తరువాత నాగన్న తోబుట్టువున కిట్లనియె.

"ఓసీ ! నీవు గయ్యాళితనము జేసి నన్నల్లరి పెట్ట దలఁచుకొన్నావా యేమిటి? నేను సుఖముగా బిడ్డవివాహము చేసుకో దలచుకొని ప్రధానము చేసికొని వచ్చినాను గదా! నా యింటిలో ఎవరో చచ్చినట్లు నీవు ఏడువవచ్చునా? శుభకార్యములు దలచుకొన్నప్పుడు ఆశుభముగా మాటలాడ గూడదు. నోరు మూసికో ! నీ కొడుకుకు పిల్లను ఏమి చూచుకుని యిమ్మన్నావు? గోష్పాదమంత భూమి లేదు. గిద్దెడు గింజలు వచ్చుట కాధారములేదు. పెండ్లి చేసిన తరువాత రేపు నీకొడుకు చచ్చిపోతా డనుకో, మనోవర్తికైన భూమి ఉండవలెనా? తల దాచుకొనుటకు కొంపైనలేదు. ఇంక నీకొడుకు గుణములు మాకు చెప్పనక్కరలేదు. ఎన్ని దుర్గుణము లుండవలెనో అన్ని దుర్గుణములు నీ కొడుకుదగ్గఱనే యున్నవి. అటువంటి నిర్భాగ్యునకు పిల్ల నేలా యియ్యగలరు? గుణముల మాటటుంచు నా కిప్పుడు రెండువందలు ఋణ మున్నది. ఆ ఋణము తీర్చుకోవ