పుట:Ganapati (novel).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

207

మా అబ్బాయి నొక యింటివానిఁ జేయఁదలచు కొన్నాఁడని తెలిసి పిల్లను వాని కియ్యకుండఁ జేయవలెనని నీవీ పన్నాగము పన్నుచున్నావు. ఈలాటి బుద్ధులు నీకు కూడవు. నీకు గిట్టకపోతే గిట్టనట్టే యుందువుగాని యిటువంటి లేనిపోని నిందలు వేయకమ్మా!"

ఇట్టి మాటలచేత మనస్సులో నున్న కోపాగ్ని రగిలిమండక మానునా ? ఈ బిడ్డ మూలమున వారికిఁ దఱచుగా కలహములు సంభవించుచు వచ్చెను. ఆ తగవులు తీర్చలేక గృహ యజమానుఁడు విసిగికొని మొత్తుకొని యన్నము తినక పస్తుండి తన్నుఁ దిట్టికొని యొకప్పుడు భార్యనుగొట్టి రెండు మూడు దినము లింటికి రాకయుండును. పిమ్మటఁ గ్రమక్రమముగా వారికి సఖ్యత గలుగుచుండును. గణపతి మేనమామ నేమియు ననజాలక పోయినను దరచుగా మేనత్తను మేనమామ లేనప్పుడు సూటిపోటి మాటలని నొప్పించుచుండును. ఇట్లుండ శివరాత్రికి మేనమామ కోటిపల్లి తీర్థమున కేగ సమకట్టెను. గణపతి తల్లియుఁ దన్ను వెంటఁబెట్టుకొని పొమ్మని సోదరుని వేఁడుకొనెను. ఆ వేఁడుకోలు నంగీకరించి యత డామెం దోడ్కొని కోటిపల్లికి వెళ్ళెను. ఇంటి యొఫ్ఫ భార్యను బిడ్డని నిలిపి వారికి సహాయముగా నింటనే పండుకొమ్మని గణపతితోఁ జెప్పి యెన్నో బుద్ధులు చెప్పి మేనమామ చనియెను గాని యా బుద్ధులు మేనల్లుని కుడిచెవిలో బడి క్షణమాత్రమైన మనసులో నిలువక యెడమ చెవిలోనుండి యావ