పుట:Ganapati (novel).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

గ ణ ప తి

నేను గిల్లినా ననుకొన్నావా? రక్కినా ననుకొన్నావా? ఎత్తుకుని యాడించినందు కేనో యక్షింతల గింజలు నాల్గు నా నెత్తిని వైవఁదలంచుకొన్నావా యేమి?" అని పెద్ద గొంతుకతో నఱచి బదులు చెప్పెను. అనవసర కలహము సంభవించు నని వానితో వాదింపక ఆమె లోనికిఁ పోయెను. తెనాలి రామకృష్ణుని పిల్లి పాలు జూడఁగనే పారిపోయినట్లు గణపతి మొగము జూడఁగానె బాలిక పెడమొగము పెట్టుకొని యతని కడకుఁ బోవుటయే మానెను. గణపతి కృతార్థుడయ్యెను. బిడ్డ యెంత గ్రుక్కపెట్టి యేడ్చుచున్నను మేనత్త గాని మేనమామ గాని దాని నెత్తుకొమ్మని మేనల్లునితో ననుట మానిరి. గణపతి బిడ్డను గిల్లినట్లో యేదో బాధ పెట్టినట్లో యనుమాన పడి మేనత్త సూటిపోటి మాట లనుచుండ, గణపతి తల్లి యవి సహింపక యిట్లనుచుండును. 'మా అబ్బాయి పిల్లను కొట్టినాఁడో తిట్టినాడో యని నీ కనుమానమున్నది కాబోలు? వాఁడాలాటివాఁడు కాఁడు. వాఁడెత్తికొనుట దీని కిష్టము లేదు. ఎందుచేత నంటే దానికి సిగ్గు. మావాఁడు దాని మగఁడు కనుక మగఁడెత్తికొని యాడించుట దాని కిష్టము లేదు. చిన్నపిల్ల కేమి సిగ్గని మీరనుకోవద్దు. దేవుఁడు వారి నిద్దరిని మగడు పెండ్లములుగా నేర్పాటు చేసినప్పుడు సిగ్గు దానంత టదే లోపలినుండి బయలుదేరును. లేనిపోని పాపముమాట లాడుకోవద్దు. నీకేమో గాని మా యబ్బాయి మీఁద లేనిపోని కోపము కలిగినది. మేనమామ పిల్లనిచ్చి