పుట:Ganapati (novel).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

గ ణ ప తి

వెళ్లిపోయెను. గణపతి తల్లికి సోదరుని భార్యమీఁదను నామె బిడ్డల మీఁదను మునుపెన్నఁడు లేని మహానురాగము నెలకొనెను. బాలెంతరాలిని మంచముమీఁదనుండి దిగనీయక పథ్యపానములు జాగ్రత్తతోఁ జేసి పెట్టుచు, బిడ్డకు నీళ్ళు పోయుట మొదలగు నంగరక్షలు తానే స్వయముగాఁ జేయుచుండును. బిడ్డ కారు మాసములు గడిచెను. అన్నప్రాశన మయ్యెను. విద్దెములు చేయఁజొచ్చెను. అత్త తాత యను మాటలు వచ్చెను. తనకు భార్య జనియించిన దన్న సంతోషము మనంబున గలుగుచుండినను గణపతి కిప్పుడొక క్రొత్త చిక్కు సంభవించెను. అతఁడు సంగడికాండ్రతో యథేచ్ఛగఁ దిరుగకుండఁ దఱచుగాఁ దన తల్లికి మేనత్తకుఁ బనితొందరలు గలిగినప్పుడు బిడ్డ నెత్తుకొని యాడించవలసిన పను లతనిమీఁదఁ బడెను. ఇది యతని కెంతో విసుగు బుట్టించు పని యయ్యెను. బాలికను వివాహ మాడవలె నను సంకల్పము గణపతికిఁ గలదు గాని యామె నెత్తుకొని యాడించి తన పనులను జెఱుపుకొనుట కెంతమాత్ర మిష్టము లేక పోయెను. ఎంతెంత యుద్యోగములు చేయువారికైనను దీరిక లుండును గాని యే ఉద్యోగము లేక గణపతికి నిమేష కాలమైనను దీరిక లేదు. ఒకవేళ నింటికడ నతఁ డుండవలసి వచ్చెనేని నట్టి కాలము వ్యర్థము కాకుండ నతఁడు గాఢనిద్ర పోవుచుండును. ఈ బిడ్డవలన నతనికి నిద్రాభంగము మొదలగునవి గలుగజొచ్చెను. అవి యతఁడు సహింపలేక యా విషయమై