పుట:Ganapati (novel).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణపతి

2 వ భాగము

పన్నెండవ ప్రకరణము

గణపతి మేనమామభార్య గర్భముఁ దాల్చెను. ఆమెకు నెల మసలినది మొదలుకొని గణపతి తల్లికి మనస్సులో నెన్నెన్నో కోరికె లుదయించెను. ఆమె కడుపున నాఁడుపిల్ల పుట్టవలయునని యామె యిష్టదైవముల వేయివిధముల వేఁడుకొనుచుండెను. ఇల్లు వాకిలి లేక మడులు మాన్యములు లేక విద్యాబుద్ధులు లేక రూపము లేక యున్న తన కుమారునకుఁ బిల్ల నిచ్చి వాని నొక ఇంటివానిని జేయుటకు లోకములో మేనమామ తప్ప మఱి యెవ్వరు లేరని యామె యూహించి, స్వలాభ పరాయణయై యట్టి కోరికలఁ గోరఁజొచ్చెను. ఆమె మనోబల మెట్టిదో కాని యామె కాఁడుబిడ్డయే కలిగెను. బిడ్డ పుట్టగానే నాకు కోడలు పుట్టినది, కోడలు పుట్టినది, యని యామె యరచి యానందాతిశయమున గంతులు వైచెను. పురిటాలిం జూడవచ్చిన యమ్మలక్క లందఱు గణపతికిఁ బెండ్లాము పుట్టిన దని సంతోషించిరి. ఆ మాట చెవిన బడినప్పుడెల్ల గణపతి మేనత్త మొగము చిట్లించుకొని "అయ్యో! నా కూఁతురు నీ నిర్భాగ్యునకాయిచ్చి పెండ్లి జేయునది" యని తనలో ననుకొను చుండును. పురుడు సుఖముగా