పుట:Ganapati (novel).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

గ ణ ప తి

నీ జట్టుపిల్లలకు రావలసిన సైనుగుడ్డ లివిగో ! ఇవి మూటగట్టుకొని తీసికొనిపోయి వారి కిచ్చి తిన్నగా నీ దారినపో !" యని గుడ్డలమూట జూపెను. గణపతి కిక్కురుమనకుండ నెంతో బుద్ధిమంతుఁడై యా మూట పట్టుకొని కన్నుల నీరచ్చటనె తుడిచి కొని తన మిత్రు లున్న చోటి కరిగెను. గణపతి మిక్కిలి సొగసైన గుడ్డలు తెచ్చునని వాటిని జూడవలయునని మిత్రు లెంతో ముచ్చటపడుచు వాని యాగమనమునకు నిరీక్షించు చుండిరి. అంతలో గణపతి గుడ్డలమూట తీసికొని వెళ్ళుటయు మూటలో నున్నవి ముద్దినుసు కోటుగుడ్డ లనుకొని పండ్లగంప చుట్టు పిల్లలు మూగినట్లు వా రాతని చుట్టు మూగి, మూట క్రిందకి లాగి విప్పి చూచి విస్మితులై "ఇదేమిరా ! గణపతీ ! చిట్టచివరకు సైనుగుడ్డలే పట్టుకొని వచ్చినావు. వ్రతము చెడినను ఫలము దక్కవలయును గదా! మనము రెండు విధముల భ్రష్టులమైతిమి. నలుగురితో మనకుగూడ నీ గుడ్డలే యిచ్చినప్పుడు పుచ్చుకొనక తెగనీల్గితిమి. కోటుగుడ్డలు కావలెనని గోల చేసితిమి. ఇప్పు డా సైనుగుడ్డలే రహస్యముగాఁ బుచ్చుకొనుచుంటిమి. మాచేత నీవు కట్టుగట్టించి మమ్మల్లరిపాలు చేయుటకా, యీగొడవ. నిన్ను నమ్ముకొనుట కుక్కతోక పట్టుకొని గోదావరీదుట! ఇటు వంటి పని యేల చేసితివి? ఈ గుడ్డలు పుచ్చుకొమ్మని నీతో మేము చెప్పితిమా? మా యిష్టములేకుండ నీ వేల తేవలెను" అని యిష్టము వచ్చిన ట్లతనిని మందలించిరి. కారణ మేదో చెప్పకపోయిన పక్ష