పుట:Ganapati (novel).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

గ ణ ప తి

వీడ్కొని వెన్నెల రాత్రియగుటచేతను రెండు గడియల ప్రొద్దు కంటె నెక్కుడు కాకపోవుట చేతను నిర్భయముగా మిత్రులున్న చోటికి వెళ్ళి పండుకొనియెను.

మరునాడు తెలతెల వాఱుచుండగా భోక్తలు పండుకొన్న చోటి కొక బ్రాహ్మణుఁడు వచ్చి గణపతిని లేపి యజమానుఁడు పిలుచు చున్నాడని చెప్పెను. గణపతి కన్నులు నులుము కొనుచు లేచి తన మిత్రులం జూచి "ఓరీ! కోటుగుడ్డలు వచ్చినవి కాఁబోలు, అందుకే నా నిమిత్తమై యాయన వర్తమానమంపించినారు. నేను వెళ్ళి యిప్పుడే వచ్చెదను. మీరిక్కడుండుడి" యని చెప్పి యాతనివెంట నడచుచు "ఏమయ్యా ! ఎందుకు నాకోసము వర్తమాన మంపించినారు? గుడ్డలు తెప్పించినారా యేమిటి? మంచివేనా గుడ్డలు? చాఱల గుడ్డలు వచ్చినవా? చాలా త్వరగా దెచ్చినారే, గుడ్డలు!" అని గుడ్డల విషయమై తనకుగల యాత్రము దెలుపఁ జొచ్చెను. తోడుకొని పోవుచున్న బ్రాహ్మణుడు వాని మాటలు విని తనలోఁ దాను నవ్వుకొనుచు "ఎందుకు వర్తమాన మంపించినారో నేనెఱుంగను. మంచి మంచి గుడ్డలు వచ్చినవని చెప్పుకొన్నారు. అందులో మీకు మిక్కిలి ప్రశస్తమైన బహుమానము చేయదలంచు కొన్నారని విన్నాను!" అని చమత్కారముగాఁ బ్రత్యుత్తరము జెప్పెను. అప్పుడు గణపతి మన సెట్లున్నదో వర్ణింపఁ