పుట:Ganapati (novel).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

గ ణ ప తి

సిన గుడ్డలు తామే చెప్పుదు రడుగండి!" యని చెప్పెను. యజమానుఁడు ముందు మాట లాడక యప్పలుకులు విని గణపతి వంక తేఱిచూచి "సరే! మీమీ కోరికల ప్రకారమె చేసెదను లెండి" యని బదులు చెప్పెను. తక్కిన వాండ్రుఁ గూఁడ దమ మనోరథములు దెలిపిరి. అనంతరము గణపతి వారి నందఱను వెంటఁబెట్టుకుని చెఱువునకుఁ బోయి స్నానముచేసి వచ్చెను. ఆ దిన మేడుగురు భోక్తలే కావలసినను యజమానుఁ డందఱు భోక్తల కన్నము బెట్టి సంతుష్టులఁ జేసెను.

భోజనానంతరమున మాకు సెలవు దయ చేయుఁ డని గణపతి ప్రముఖులు యజమాను నడిగిరి. "మీరు కోరిన బహుమానము లీ రాత్రి దెప్పించుచున్నాను. రేపుదయమున మీరు వెళ్ళవచ్చు" నని యజమానుఁడు బదులు చెప్పెను. సంతుష్టహృదయులై వారంద ఱచ్చట నా రాత్రి నిలువఁదలఁచిరి. గణపతి యాకారముచేత గాకపోయినను గొప్ప యాకలిచేతనైన వృకోదరుం డగుటచే నతనికి నా రెండు దినములలో రాత్రి మిక్కిలి యాఁకలిబాధ కలిగెను. ఉదయమున జల్ది కూడు లేకపోటొకటి, రాత్రి మజ్జిగన్నమైన దొరకక పోవుట యొకటి ఈ రెండు లోపముల చేత నతఁడు మధ్యాహ్నమునఁ గుడుముల తోడను సుష్టుగా భుజించినను రాత్రి పేరాకలికి నకనకబడి, తెల్లవారు నప్పటికి వాడి వత్తియయ్యెను. పండ్రెండవ నాఁటి రాత్రి క్షుధానలము యొక్క దండయాత్ర కాతని గర్భకోశ