పుట:Ganapati (novel).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

187

ఈ లోపున రెండవపక్షమువారిలోఁ గొందఱు కర్తగృహమున కరిగి, గణపతి చెరువుగట్టు దగ్గఱ రావిచెట్టుక్రింద భోక్తలనందరఁ జేరదీసి కోటుగుడ్డల నడుగమని యుపన్యసించుటయు దాము భిన్నాభిప్రాయులై యతని యుపదేశంబుల నిరాకరించుటయుఁ మాటలాడుట క్రమక్రమముగా ముదిరి పోట్లాడుటగా మారుటయుఁ దమ సంఖ్య స్వల్పముగా నుండుటచే దాము దెబ్బలు తిని యోడిపోవుటయు మున్నగు వృత్తాంత మంతయు నాతని కెఱింగించి తమ గాయములం జూపిరి. శ్రాద్ధభోక్తలు కోటుగుడ్డలు కోరుట కలికాల మహిమ అనుకొని యాకర్త దానికిందగు బ్రతి విధానము మనసులో నాలోచించి సిద్ధముగా నుండెను. అంతలో గణపతి మిత్రబృందముతో వెళ్ళి, కూర్చుండెను. రెండుజాములైన తరువాత బ్రాహ్మణుల యధాస్థానములఁ గూర్చుండఁబెట్టి కర్త యర్చింపఁ దొడఁగెను. అర్చింపఁబడువారిలో మొట్ట మొదటివాఁడు గణపతి. పసుపు గణపతి యైనతోడనె నిజమైన గణపతిపూజ వచ్చెను. పసుపు గణపతివలె నేమిచ్చిన దానితోనే తృప్తినొందక మన గణపతి బొజ్జనిండఁ గోరికలు పెట్టుకొనియుండెను. భోక్తకు వస్త్ర మియ్యవలసిన సమయమున తడిసిన సైనుగుడ్డ తెచ్చి కర్త యియ్యవచ్చినపుడు 'నేనీ గుడ్డ పుచ్చుకోను. మంచి కోటుగుడ్డేదైన నాకియ్యవలెను. మరొకటి నేను పుచ్చుకొన' నని పలికెను. కర్త యప్పలుకులు విని మిక్కిలి యచ్చెరువడి గణపతి వంక తేరిచూచి "ఏమీ! కోటుగుడ్డలే కాని పుచ్చుకొనవా? కోటుగుడ్డ లిదివర కెన్నడయిన పుచ్చుకొంటివా? కలికాలముచేత నేటి కాలమున నీ వొకఁడవు కోర