పుట:Ganapati (novel).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

గ ణ ప తి

అవి కట్టుకొన్నవానికి మునుపున్న కళకాంతులు కూడ నశించును. మంచిగుడ్డలు వేసికొనవలె నని మనకుఁగూడ నుబలాట ముండునుగదా! అందుచేత మన మందర మొక కట్టుకట్టి భోక్తలకు సైనుపంచె లిచ్చుటకు మారుగా మంచి కోటుగుడ్డ లీయవలసినది; అలా గీయని పక్షమున మేము బ్రాహ్మణార్థములు చేయ మని స్పష్టముగా చెప్పవలసినది, మన మందఱ మొక్క మాటమీఁద నిలువబడిన పక్షమున మన కోరికె సిద్ధించును. కప్పల తక్కెడవలె నొకరితో నొకరు సంబంధము లేకున్న యెడల మనయందు గౌరవముండదు. ఒక్క మాటమీఁద నుంటిమా కర్మలు చేయువారు మన కాళ్ళ మీఁద బడుదురు. ఏమిటి మీ యభిప్రాయము? మీ కందఱకిష్టమా? అయిష్టమా? ఆ పలుకులు భోక్తలుగా వచ్చిన వారిలోఁ గొందరికి సంతోషకరములయ్యె. మంచి మంచి కోటులు దొడిగికొని తిరగవచ్చు నని వా రా సలహా బాగున్నదనిరి. కోటుగుడ్డ లెట్టివో యెఱుఁగనివారు కొందరందుండిరి. వారందరా సలహాకు సమ్మితింపక "ఛీ! కోటు గుడ్డ లేమిటి? పెద్దల నాఁటినుండి సైనుగుడ్డ లిచ్చుటే యాచారమైయున్నది. కోటుగుడ్డలిచ్చుట, పుచ్చుకొనుట గూడ మిక్కిలి యనాచారము. ఇది విన్నపక్షమున శంకరాచార్యులవారు మనల నందర వెలివేయుదురు. ఈ కట్టు కట్టితిమా దేశములో మన కుప్పైన బుట్టదు. కాఁబట్టి మీ జట్టులోకి మేము రాము" అని భిన్నాభిప్రాయు లయిరి. "ఇందు స్వాములవారు వెలి