పుట:Ganapati (novel).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

గ ణ ప తి

సంపాదింపవలె నన్న నతని గుజ్జురూపమునకుఁ దగిన కోటులు దొరకుట యరుదు. స్వగ్రామము చేరిన నాలుగు దినములకుఁ దన బుద్ధి విశేషముచేత నార్జించిన ముచ్చెల నుపయోగింపవలె నని యభిలాష వొడమ, గణపతి మూట విప్పి జోడుదీసి చూచి దాని యందమునకుఁ గడుంగడు సంతసించి యది యున్న దున్నట్లుగాఁ దొడగుకొన్న పక్షమునఁ తన దొంగతనము వెంటనే బయట పడునని శంకించి దానికి మారురూపము గల్పింపఁ దలచి దాని మీఁద నున్న జల్తారు నూడఁబెరికి యావలఁ బారవైచి తొడిగికొని, మొదటి దినమున దన యింటిలోనె బదిసారు లిటునటు బచారు చేసెను. తన యైశ్వర్యముం జూచి చుట్టములు నెచ్చెలులు సంతోషింపఁవలెనని లోకమునఁ ప్రతి మనుష్యుడు గోరును గదా! అట్లే గణపతిగూడఁ దన భాగ్యవశమునఁ దనకు లభించినదియు నాగ్రామమున ననన్యలబ్ధమైనదియు నగు ముచ్చెలజోడు దొడిగికొని బంధుమిత్రుల కన్నులకు విందుసేయవలెనని తలంచి నోట చుట్ట వెలిగించి కుచ్చుతలపాగ జుట్టి రాజమహేంద్రవరము నందలి కొందఱు పెద్దమనుష్యుల వలెఁ జేతిలో కఱ్ఱ బట్టుకొని ముచ్చెలు దొడిగికొని టక్ టక్ మని చప్పు డగునట్లు నాలుగు వీధులు దిరిగి పనిలేని చోటసైత మాగుచుఁ దన చెలికాండ్రం బిలిచి యేదో సంభాషణ సేయుచు, 'మీ గాళ్ళవాపు మొగముమీఁదనె తెలియు' నన్నట్లు ముచ్చెలజోడు లభించె నన్న యానందము ముఖవికాసమె తెలియఁ జేయునట్లు