పుట:Ganapati (novel).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

గ ణ ప తి

యయ్య బేడ బేడ యిచ్చి సాగనంపినారు. బ్రాహ్మణులు తోరణములు తెంపినారు. ఎంతో గందరగోళమైనది. నీ సంభావన డబ్బు లేమి చేసికొన్నావు? అవిపెట్టి కొనరాదా" అని యతఁడు పలుక గణపతి "గోదావరిలో స్నానముచేయుచుండగా మూట విడిపోయి సంభావనడబ్బులు పడిపోయినవి. నీవంటివాని నాశ్రయించినందుకు నా కోరిక తీరకపోవలసినదేనా? పోనీ మీ నాన్న చేత బదు లిప్పించు. రెండు షోడశబ్రాహ్మణార్థములు చేసి నీ యప్పు తీర్చెద" నని యుత్తరము చెప్ప పెండ్లికుమారుఁడు "మా యయ్య నా సిఫారసుమీద నీ కప్పియ్యఁడు. అట్టియాస బెట్టుకొనకు" మని ప్రత్యుత్తర మిచ్చి పంపెను. గణపతి భగ్నమనోరథుఁడైనను ముచ్చె లెట్లయిన సంపాదించి తీరవలయునని కృతనిశ్చయుఁడై ఉపాయాన్వేషము జేయఁజొచ్చెను. ఉపాయము పొడగట్టెను. అతని యదృష్టవశమున నా సాయంకాలము బంధువైన వైశ్యుఁ డొకడు పదియేండ్ల వయసుఁగల తన కుమారుని వెంటబెట్టుకుని పెండ్లివారిని జూడవచ్చెను. అప్పుడు రెండు గడియలరాత్రి యయ్యెను. ఆతని కుమారుఁడు జరీపని చేసిన ముచ్చెలజోడు తొడుగుకొనివచ్చి యది గుమ్మము ముందరవిడిచి లోనికిఁ బోయెను. అది ముద్దుల మూటగట్టు చున్నట్లు గణపతికిఁ దోచెను. ఎట్లయిన నదిగాని యటువంటిది గాని తన కుండినపక్షమున తన జన్మము ధన్యమగునని యతఁడు