పుట:Ganapati (novel).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

167

జాకలివాండ్రు తిరుమంత్రమువలె నెవరికిఁ జెప్పకుండ దాఁచదలచిరి కాని వారి కడుపులలో ఇది యిమిడినదికాదు. నోట నువుగింజ నానని తుచ్ఛులనోళ్ళలో రహస్యము దాఁగునా? చాకలివాండ్రు, మంగలివాండ్రతోను మంగలివాండ్రు బాకాలూదు దూదేకుల సాహేబులతోను, వాండ్రు తమయాప్తులతోను జెప్పఁగా బరమరహస్యము సూర్యోదయ మగునప్పటికె గుప్పుమని వెల్లడియయ్యెను. అందఱు గణపతిని జూచి ముసి ముసి నవ్వులు నవ్వువారె. అందఱు నతని తలమీఁద జేయివైచి గిరజా లెదిగినవాయని పరిహాసము చేయువారె. అందరు శిరోజవృద్ధికి దోహదములు చెప్పువారె. వెండి, బంగారు దొంగలుపోయి యాముదపు దొంగలు బయలుదేరినా రని యొకఁడు, తల వెంట్రుకలు పెరుగుటకు తగిన దోహదమాముదమే యని యొకఁడు, తైలముకంటె మొట్టికాయలు డిప్పకాయలు వెంట్రుకల వృద్ధికి మంచి యౌషధమని యొకఁడు చమత్కారముగ మాటలాడిరి. గణపతి తక్కిన మాటలకు సరకు చేయలేదు. కాని యాముదపు గొంగలు వచ్చినారన్నపుడు మాత్రము కొంత ప్రసక్తిని గల్పించుకొని యాముదము దొంగిలించునట్టి నిర్భాగ్యు లెవ్వరుండరు. చాకలి వెధవల మాటలు నమ్మి మీరుకూడ గంతులు వైచుచున్నారని ప్రత్యుత్తర మిచ్చెను. "గుమ్మడికాయలు దొంగ" యనగా బుజము తడిమి చూచుకొన్నట్లు పెండ్లికి వచ్చినవారిలో నింతమందియుండగా "ఆముదము దొంగయున్నపుడు నీవే పూసి