Jump to content

పుట:Ganapati (novel).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

గ ణ ప తి

"గణపతీ! చాకలివాండ్రు బుద్ధిపొరబాటుచేత నిన్నాలాగున ననిరి. నీవంటివాఁ డిటువంటి పని చేయునా? కాని యా దొంగ యెవడో మన మందర మీరాత్రి కలిసి పట్టుకొంద" మని వెడలి పోయిరి. ఆనాఁటి రాత్రిగూడ గణపతి గతరాత్రమునందు వలె శిరస్సునకు తైలమర్దనము నందభిలాషగలవాఁడై రజకులు పండుకొన్న నెలవున కరిగి మెల్లగా నొకసిద్దె వంచెను. చాకలివాండ్రలో నొకఁడు సారా త్రాగివచ్చి పండుకొని సమీపమున బొరలుచు మరల ద్రాగుటకు నొక సీసానిండ సారాతెచ్చి సిద్దెలప్రక్క బెట్టుకొనియెను. గణపతి చీకటిలో నది కనిపెట్టలేదు. ఆ రజకుఁడు గణపతినిజూచి తన సారా దొంగిలించుకొని పోవుట కెవఁడో దొంగ వచ్చెనని భావించి "దొంగ తొత్తుకొడుకా! నా సీసా దొబ్బుకొనిపోవుటకు వచ్చినావా" యని లేచి వెన్నుమీఁద రెండు చరపులు చరిచి తిట్టనారంభించెను. ఆ చరపుల చప్పుడు తోను, దిట్లతోను దక్కిన చాకలివాండ్రు మేల్కాంచి దొంగవచ్చినాఁడనుకొని గణపతిని బట్టుకొనిరి. అతఁడు ప్రతిష్ఠా రక్షణ మందు మిక్కిలి జాగరూకుఁ డగుటచే సుమూహర్త సమయము నను సదస్యమునాడునుఁ దనకు దొరికిన సంభావన డబ్బులు చాకలివాండ్ర చేతులలో బెట్టి తనను నలుగురిలో నగుబాట్లు సేయవలదని చేతులు పట్టుకొని వాండ్రను బ్రతిమాలి యాముదపు మరకలు దిండుమీద చేసినది తానే యని యొప్పుకొని వారి బారినుండి తప్పించుకొని పోయెను. ఈ పరమ రహస్యమును