పుట:Ganapati (novel).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

161

డవనాఁడును విఘ్నేశ్వర పూజాసమయమున స్థాపింపబడు పసుపు గణపతితో బాటు మూర్తీభవించిన శ్రాద్ధదేవతవలె పితృలోకమునుండి వచ్చిన ప్రేతవలె మన గణపతి వుండితీరవలయును. గణపతి తిండిపోతని చదువరు లిదివఱకె యెఱుఁగుదురు. భోజన విషయమున నతని ప్రజ్ఞ యాకారమునకుఁ దగనిది. అతని విగ్రహము పొట్టిదైనను వాని యాఁకలి మిక్కిలి పొడుగుది. బ్రహ్మదేవుఁ డతని కీయదలఁచిన ప్రజ్ఞయంతయు జీర్ణకోశమునందు పెట్టెను. శ్రాద్ధబోజనముల యం దతఁడు మెక్కునట్టి యరిసెలు, గారెలు, కుడుములు మొదలగునవి పుంజీల లెక్క ప్రకారము చెప్పుకొనుట సుకరముగాని విడిగా లెక్కించుట సుకరము కాదు. బోజనవిషయమున నతఁడు సర్వభక్షకుఁడని చెప్పవలెను. ఇది యిష్ట మది యిష్టములేదన్న మాటలేదు. ఏమియు దొరకనప్పుడు పెసరకాయలు, కందికాయలు, శనగకాయలు, జొన్నచేలలో నూచబియ్యము, తాటిపండు మొదలైనవిగూడ నతఁ డారరించును. శ్రాద్ధభోజనముల వలన నతనికి మరల కొంత డబ్బు దొరకఁ జొచ్చెను. ఆ దినములలో నతని జీవచరిత్రలో నొక్క మార్పు తెచ్చుటకు సమర్థమైన కార్యమొకటి జరిగినది. ఏనుఁగుల మహలునుండి కోమటు లొకరు రాజమహేంద్రవరములో వివాహసంబంధము నిశ్చయించి తరలివెళ్ళిరి. పెండ్లికుమారునకును గణపతికిని మొదటినుండియు జీట్లపేక దగ్గఱ స్నేహమగుటచే నతఁడు ప్రియమిత్రుడైన గణపతిని తన వివాహమునకు