పుట:Ganapati (novel).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

గ ణ ప తి

వచ్చినను వాని యుపాహారములకె సరిపొవుచు వచ్చినది. ఈ విధముగ వ్యాపారము చిరకాలము సాగినదికాదు. ఒక గ్రామవాసులు మఱియొక గ్రామమునకు గార్యాంతముమీఁద వెళ్లుట తటస్ధించుచుండును. కావున గణపతియొక్క చేష్టలు క్రమక్రమముగ బయలుపడెను. జనులకు విశ్వాసము తగ్గెను. చుట్టుపట్ల గ్రామములలో నతని మాటకుఁ జెల్లుబడి లేకపోయెను. అందుచే మునుపటివలె నతనిచేతినిండ డబ్బుచిక్కుట కవకాశము గలుగదయ్యెను. మరల నతనికి డబ్బు సందర్భమైన యిబ్బంది తటస్థించెను. ఆ యిబ్బంది గడచుటకై యతఁ డొకనాఁడు దీర్ఘముగా నాలోచించి వైదికులపాలిఁటి కల్పవృక్షమని కామధేనువని చెప్ప దగిన శ్రాద్దభోజనమె శరణ్యమని నిశ్చయించెను. సామాన్యమైన యాబ్దికమునకు మంత్రితుఁడై పోయిన వానికి నొక్కడబ్బుకంటె నెక్కువ దొరకదు. మాతాపితృభక్తి యత్యధికము గలవారు రెండు డబ్బు లిచ్చుచుందురు. మిక్కిలి భాగ్యవంతులగువారు వస్త్రము లిచ్చి యొక యణాగాని రెండణాలుగాని దక్షిణ నిత్తురు. కడపటివారు మిక్కిలి యరుదుగ నుందురు. అట్టి బ్రాహ్మణార్థములకు బోయినపక్షమున గడుపునిండ భోజనము లభించుటయె తప్ప దక్షిణ బాగుగ దొరకదని షోడశబ్రాహ్మణార్థములు చేసిన పక్షమున జేతినిండ బుష్కలముగ సొమ్ముండునని తద్విషయమై ప్రయత్నించెను. చుట్టుప్రక్కలనే బ్రాహ్మణుఁడు చనిపోయినను బదియొకండవనాఁడును, పడ్రెం