పుట:Ganapati (novel).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

159

మ్రొక్కు తీరినదికాదు. ఏడుకొండల వెంకటేశ్వర్లు వడ్డికాసుల వాడన్నమాట మీకు తెలియునుకదా! అతని మ్రొక్కులు, ముడుపులు చెల్లకపోయినయెడల వెండి బెత్తములతోను బసిడి బెత్తములతోను వీపు పగులఁ గొట్టునని మీరంద ఱెఱిగిఁయె యున్నారు. రాత్రులు దెబ్బలు తినలేక నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నాకీశ్రమ మీరు తప్పించవలెను. వెంకటేశ్వరుల వారికిఁ వెండి చెంబొకటి చేయించి నేను ముడుపు చెల్లించవలెను. దాని కేబది రూపాయలు కావలెను. నదగ్గఱ గ్రుడ్డిగవ్వ లేదు. బ్రాహ్మణ బాలకుని యాపద తప్పించవలసిన భారము మీపై నున్నది. ఈ సహాయము జేసిన మీకెంతో పున్నెముండును. వెంకటేశ్వరుల వారిచేత దెబ్బలు తిని చచ్చిపోకుండా నన్ను మీఱందరు గాపాడవలయును. నాకు మీరే తల్లి, మీరే తండ్రి" యని యడుగుటయు వాని దీనాలాపనముల విని మగవాండ్రు, నాడువాండ్రు జాలినొంది తోఁచినసహాయము చేయుచు వచ్చిరి. ఈ వ్యాపారములో దిరిగిన తరువాత గణపతియెద్దకు ప్రతిదినము కొంచెముగానొ కుప్పగానొ డబ్బు నిలువయుండ జొచ్చెను. కావలసినన్ని పొగచుట్టలు, కావలసినన్ని తమలపాకులు కొనుట కవఁకాశము గలిగెను. అతడు స్నేహితుల కప్పుడప్పు డొకయణా, రెండణాలు బదులియ్యజొచ్చెను. గణపతి భోజనమునందు మహాగణపతీతుల్యుఁ డగుటచే నెంత డబ్బు