పుట:Ganapati (novel).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

15

బాణుడు కాదంబరీ హర్షచరిత్రలను విధిలేక వ్రాసియుండును. మన పూర్వజన్మ పుణ్యముచేత లభించిన యీ యద్భుత చరిత్రమును గణపతి ప్రతిష్ఠకుఁ దగినట్లు రచియింపలేకపోయినను నేదోవిధముగ యథాశక్తి సహగమనమువలె రచియింపఁ దలచుకొంటిని.

రెండవ ప్రకరణము

ఆహాహా! మన దేశమునందు జీవచరిత్రములు లేని లోప మిప్పుడు కనఁబడు చున్నది. చరిత్రరచనమునందు మన పూర్వులకు శ్రద్ధ యెంతమాత్రము లేకపోవుటచే నొక్కమహాపురుషుని చరిత్రయైన జదివెడు భాగ్యము మన కబ్బినది కాదు. రాజరాజనరేంద్ర ప్రముఖులగు మహారాజుల యొక్కయు నన్నయభట్టారక తిక్కనసోమయాజి ప్రముఖ మహాకవుల యొక్కయు చరిత్రములు చేకూరనందుకు మన మంత విచారించవలసిన పనిలేదు. కాని గణపతియొక్క చరిత్రము సంపూర్ణముగ లభియింపనందుకు మనము కడుంగడు విచారింపవలయును. ఆ విచారములోనె గుడ్డిలో మెల్ల యనునట్టు కొంత చరిత్రము మన కసంపూర్తిగనైన లభించినందుకు సంతోషింపవలయు; సంగ్రహముగనైన నీ చరిత్రము నాకెట్లు