పుట:Ganapati (novel).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

గ ణ ప తి

చుండెను. విధిలేకయె మఱచిపోయియె మునుపు జమాబంది యైన గ్రామమె మరల వెళ్ళవలసి వచ్చినపుడు తండ్రి చచ్చి పోయినాఁడన్న మిష సాగదని తల్లి చచ్చిపోయినదని వంక బెట్టును. తల్లి యింటఱాయి లాగున నుండఁగ నామె చనిపోయిన దని చెప్పుటకు నోరెట్లు వచ్చినదని మీరు సంశయింతురు కాఁబోలు. అట్లు సంశయింపవలసిన పనిలేదు. ఏలయన "జాతస్య మరణంధ్రువ" మ్మను మాట మీరు విన్నారుగదా. 'పుట్టిన వాఁడు గిట్టక మానడ' ని దీనియర్థము, ఆ మాటయందు గణపతికి మిక్కిలి విశ్వాసము కలదు. తన తల్లి యెప్పుడో చావక మానదని గణపతి యెఱుఁగును. ఎప్పుడైనను జచ్చిపోవలసినదె కనుక తనకు డబ్బవసర మున్నప్పుడు చచ్చిపోయినదని చెప్పుట చేత నెంతమాత్రము పాపములేదని గణపతి యాశయము. పది సంవత్సరముల తరువాత జరుగఁదలచిన కార్యము పది సంవత్సరములముందు జరిగినదని చెప్పుట తప్పుగా నతఁ డెంచలేదు. ఒకప్పుడు తల్లిమాసికమని బిచ్చమెత్తును. ఒకప్పుడు తండ్రి తద్దినమని యడిగికొనును. ఒకప్పుడు తాను ప్రయాణము చేయుచుండఁగా మార్గమధ్యమున దొంగలు కొట్టి చెంబులు గుడ్డలు బత్తెపుఖర్చు నిమిత్తము దగ్గరనున్న డబ్బు తీసుకున్నారని చెప్పి ముష్టి యెత్తును. కొన్ని గ్రామముల కరిగి యతఁ డీక్రింది విధముగఁ భిక్షాటనము జేసెను. "అయ్యా ! నా తల్లి కెందరో బిడ్డలు చచ్చిన తరవాత నేను పుట్టితిని. నేను పుట్టినపుడు మా తల్లి నన్ను తిరుపతి తీసికొని వెళ్ళవలయునని మ్రొక్కుకొన్నది. పేదవాండ్ర మగుటచేత