పుట:Ganapati (novel).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

155

నవి పుష్కలముగ నుండిన పక్షమున గుణగ్రహణ పారీణుఁడైన యెవఁడైన నతని ప్రతిరూపము దీసియుండిన పక్షమున నట్టి ప్రకృతి యెంత వినోదకరముగ నుండును? ఎంత జగన్మనోహరముగ నుండును? ఎన్ని కోట్ల ప్రతులు కర్చైయుండును? గణపతి యొక్క మూర్తివిశేషము జూచుభాగ్య మాంధ్రమహాజనులకు లేదు. మూర్తియంతయుఁ చూచుభాగ్యము లేకపోయినను దానిండ్లమీఁద రాళ్ళు విసరినప్పుడు, స్త్రీలు కాళ్ళనడుమ పల్లేరుకాయలు చల్లినప్పుడు, సంగడికాండ్ర మేనులకు దూలగొండి రాచినప్పుడు ముసలమ్మలు, యువకులు, స్నేహితులుఁ దన్ను దిట్టుచుండ నత్తరి పండ్లిగిలించి యతఁడు నవ్విన నవ్వైన బ్రతిబింబములో జూచు భాగ్యముండినను మనము ధన్యులమైయుందుము. మందభాగ్యుల కట్టి ధన్యత యేలగలుగు? రూపదర్శనమువలన గలుగు సంతోషము లేకపోయినను శ్రీకృష్ణలీలల కన్నను మిక్కిలి రమణీయములైన గణపతి లీలలలో గొన్నిటిని జదివి యానందించు భాగ్యమబ్బినది కనుక చదువరులు కొంతవఱకదృష్టవంతులె. గణపతికి క్షీరపానమునందు మిక్కిలి యాసక్తి. పాలు కొని త్రాగుట కతనిదగ్గఱ డబ్బులేదు. అనేకోపాయములచే సంగ్రహించిన డబ్బు పొగచుట్టల కైన దిన్నగా సరిపోదు. కొనుటకు డబ్బులేనంత మాత్రముచేత పాలుత్రాగుట మానుకొనునంతటి మూర్ఖుడుకాఁడు. కావున గణపతి క్షీరసంపాదనము కొక యుపాయము గనిపెట్టెను. పొలమునుండి సాయంకాల