పుట:Ganapati (novel).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

గ ణ ప తి

ఉత్సాహము మరల నంకురించెను. నాలుగు పొలిమేరలనడుమ నున్న నేల యంతయు నతనికి విహారభూమి యయ్యెను. అన్ని తోట లతనివె. అన్నిదొడ్లతనివె. పండిన మామిడి చెట్ల కడకుఁ బోయి తాళ్ళు రువ్వి పచ్చికాయలు పడగొట్టి సంగడి కాండ్ర చేత నుప్పుకారము దెప్పించి యా కాయలు గరిగమ్మతో గోసి కొనియొ పండ్లతో బీకియొ ముక్కలుచేసి కార మద్దుకొని తిను చుండును. తోటకాపులు దూరమునఁ గానఁబడిన తోడనె వారి యదలింపు మాటలు చెవులఁ బడినతోడనె తానును జెలికాండ్రును లేళ్ళవలె బరుగెత్తి పోవుదురు. నేర్పరులయిన శిష్యుల కాళ్ళకు బందములు వైచి కొబ్బరి చెట్లెక్కించి కాయలు తీసి పగులగొట్టి నీరుద్రావి గుంజు తినుచుండును. నీలాటరేవులలో సాయం కాలమప్పుడు నిలువఁబడి బెడ్డలువిసిరి నీటికుండలు పగుల గొట్టు చుండును. కుండ పగులగానె తూనీఁగలాగు పఱుగెత్తుచుండును. పట్టువడినప్పుడు చెంపకాయలు పుష్కలముగఁ దినుచుండును. ఒకనాఁ డొక జామి తోటలో దోరగా బండిన పండ్లు గణపతియు మిత్రులును శిలావర్షము గురిపించి నేల గూల్చుచుండ నంతలో గాఁపువాఁడు వాండ్ల కెదురుగా రాక వెనుకపాటున వచ్చి యొకచేతితో గణపతిని మఱియొకచేతితో వాని స్నేహితులలో నొకనిని బట్టుకొని బరబర లాగికొని పోయి వారి నిరువుర నొక చేట్టునకు రెక్కలు విఱిచికట్టి చింత బరికెలతో నెత్తురు దొరగునట్లు కొట్టి యెన్నఁడు తోటదరికి