పుట:Ganapati (novel).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

151

దెన్నడులేని పాడుపని జేసి వీఁడప్రతిష్ట దెచ్చుచున్నాఁడని నే నేడ్చుచున్నాను. కాని నీకొడుకును జంపవలయునని కాదు. చీలవలయునని కాదు. వచ్చి యెప్పటిలాగున నుండుమని చెప్పు. ఇంకొకసారి యిటువంటి పని జేసెనా తాటికమ్మతో వెన్ను బ్రద్దలు కొట్టెదనని చెప్పు. నీవు చేయుచున్న గారమునుబట్టి వాఁడు చెడిపోవుచున్నాడు. గారము గజ్జెల కేడ్వగా వీఁపు దెబ్బల కేడ్చిన దన్నట్లు దెబ్బలు లేకపోబట్టి వానికా వినాశకాలము వచ్చినది. పరువు మర్యాదలు వాఁడు జంపుకొన్నాడు. తన తండ్రి యెంతవాడో తన తాత యెంతవాడో యివతల నేనెటువంటివాఁడనో వాడెఱుఁగడు. గాడిదనెక్కి కుక్కనెక్కి వాఁడేదో గొప్పవాఁడనైనా ననుకొనుచున్నాడు., నాకవి కిట్టవు. వచ్చి జాగ్రత్తగా నుండుమను" ఆ పలుకులు సింగమ్మకు మేరమీఱిన సంతోషము కలిగించెను. అంతకు ముందు కుమారునకుఁ దనకు శాశ్వత వియోగ మగునని బెంగబెట్టుకొనెను. సోదరుని వాక్యములవలన బెంగ తీఱినందున నాకు యేనుఁగు నెక్కినట్లు సంతసించెను. ఆ పూటనె యామె వెళ్ళి కొడుకును దోడితెచ్చి యెప్పటివలె నింట నుంచెను. గణపతి రెండుమూఁడు దినముల వఱకు మేనమామ యొద్ద మిక్కిలి భయభక్తులు కలిగి యేజోలికిఁబోక యిల్లుకదలి వెళ్ళక జాగ్రత్తగ నుండెను. కాని వీరణము చప్పుడు వినఁగానె పైత్యపు మేని వానికి శివ మెత్తినట్లు మిత్రులను జూడఁగానె యతనికి