పుట:Ganapati (novel).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

149

ప్రోగులలె నితని చరిత్రము లోకమందు ప్రసిద్ధము గాక యుండును గదా. ఎట్లో యొక యట్లు చరిత్ర ప్రసిద్ధమైనది. కాఁబట్టి యతఁడు గార్దభ మెక్కినంత మాత్రమున నింద్యుఁడని మీరు భావింపవలదు.

తొమ్మిదవ ప్రకరణము

గణపతి యింటికి రాక పరిగృహంబున వసియించుట మాతులునకు మనఃఖేదము గలిగింపకపోయినను దల్లికిఁ దగని తల్లడపాటును గలిగించెను. మధ్యాహ్నము భోజన మైన తరువాత నామె సొదరుఁడు చూడకుండ కొడు కున్నకడకుఁ బోయి వాని బ్రతిమాలియుఁ జీవాట్లు పెట్టియు బెదరించియు నెన్నో విధముల నింటికి రమ్మని యడుగుచు వచ్చెను. నిజముగ మేనమామ దుడ్డుకర్రతో బుర్ర పగులగొట్టునని నమ్మి తెనాలి రామ కృష్ణుని పిల్లి పాలపేరు చెప్పగానె భయబడి పరుగెత్తినట్లు గనపతి యిల్లుపేరు చెప్పగానె యులికిపడి "నేనా యింటికిరాను. నీ యన్నగారు దుడ్దుకర్రతో నన్ను కుక్కను గొట్టినట్లు కొట్టి చంపివైచును. నేను చచ్చిన తరువాత నీవేమి చేయఁగలవు? అన్నము లేక చచ్చిపోయెద గాని దుడ్డుకర్ర దెబ్బతిని చావను. నేను గాడిద నెక్కిన దన కెందుకు? నాజోలికి రానని యాయన గారు వర్తమానము పంపిన పక్షమున నేను వచ్చెదను. లేనిచో