పుట:Ganapati (novel).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

గ ణ ప తి

చదువుటవలన నైదు బరులు గుణింతములు నేర్చి పుస్తకము పట్టెను. మఱి రెండు సంవత్సరముల పాటు చదువుకొన్న పక్షమున దన కొడుకు బడిపంతులుపని చేసియైన నింత యన్నము దెచ్చుకొని తినగలఁడని తల్లి దలంచు చుండెను. కాని దానికి దగిన యవకాశములు గణపతికి గలుగవయ్యెను. మిత్రు లెక్కువైరి. వ్యాపారము లధిక మయ్యెను. ఇంట తీరిక నిముసమైన నిలుచుటకు లేకపోయెను. కష్టపడి చీట్ల పేక యాడుట నేర్చుకొనియెను. తురుపులాట దొంగాట పట్లాట మొదలగు వానియందెంతో నేర్పరి యయ్యెను. డబ్బు పెట్టి పేకాడవలయునని యతని కుత్సాహము కలిగెను. కాని పాపము ! దైవ మతనిని భాగ్యవంతుల యింట బుట్టింపక నిఱుపేదల యింట బుట్టించెను. "ధన మూల మిదం జగత్త" ను మాట మొదటిసారి యతనికిఁ దోచెను. ఆ యాట నారంభించిన తరువాత మేనమామ విభూతిబుట్టలో వైచుచున్న డబ్బులు తల్లి తన వదినెగారు చూడకుండ బియ్యమమ్ముఁకొని యుప్పబుట్టలోను గూటిలోను దాఁచుకొన్న డబ్బులు మాయమైపోవ జొచ్చెను. మేనమామ కప్పు డప్పుడు మేనల్లుని మీద ననుమానము కలిగి యావిషయము చెల్లెలి కెఱిఁగింప యామె యభిమానము చేతనో నిజముగా నమ్మి యుండుట చేతనో "అన్నయ్యా ! నీ మేనల్లుడు దగ్గఱ మఱియే దుర్గుణ మున్నదన్న నొప్పుకొనవచ్చును. కాని దొంగతన మున్నదని యొప్పుకొనలేను. ఇదివఱ కెన్నడు జూడఁ