పుట:Ganapati (novel).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

గ ణ ప తి

కెను. ఆ పలుకులు విని సింగమ్మ కంట దడి పెట్టుకొని "అన్నయ్యా! నీవాలాగున నంటే నేనిఁక గంగాప్రవేశము కావలసినదే. పిల్లవాఁడల్లరి చేయునపుడు శిక్షింపవద్దని యెవ్వరన్నారు. నేనుమాత్రము కొట్టనా తిట్టనా? కాకపోయినా వీఁడు బండ వాడగుటచే నాకిన్ని పాట్లు వచ్చిన" వని తనకొడుతో వచ్చిన రెండవ పిల్లవానిని చూచి "యీ దొంగ పిల్లవాఁడే మాపిల్లవాని బుద్ధి విరిచి పాడుచేయుచున్నాఁడు. అంతకు ముందింత పాపము లేదు. వీఁడెవఁడో మాయింటికి మారకుఁడు బయలు దేఱినాఁడు. నూతిలో మా వాఁడు పడనిదె పడినాఁడని కేకవైచి పాఱిపోయినాడు. ఈపాడు పిల్లల మూలమున నేను బ్రతుక లేకున్నాను. మా యింటికి రావద్దంటే మానరు. ఇది నా కర్మ" మని మొత్తుఁకొనెను. అప్పుడు సింగమ్మతో సోదరుఁ డిట్లనియె. "నేఁడు మొదలుకొని నీకొడుకు నా చెప్పుచేతలలో నున్న పక్షమున నాచేతనైనట్లు నేను బాగుచేసెదను. నేను కొట్టినను, తిట్టినను పడవలయును లేదా మీకు, నాకు సరి. ఈ మాటు నీకొడుకు పాఱిపోయినాఁడా కాలికి బొండ వైచెదను." అనవుడు సింగమ్మ "నీయిష్టము వచ్చినట్లు చేయవచ్చు నాయనా ! చదువు రాక పోయినప్పటికి బుద్ధి కొంచెముంటే చాలునని నే నేడ్చుచున్నాను. బుద్ధికూడ లేకపోయినది కదా!" యని యేడ్చెను. అక్కడ చేరినవారు తలకొక మాట యని యెవరిదారిని వారు జారిరి. సింగమ్మ కుమారుని పండుకొనబెట్టి తానును కొంతసేపు విల