పుట:Ganapati (novel).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

131

చేరినవా రతనితోఁ జెప్పిరి. కళేబరము కనఁబడక పోవుటచే సింగమ్మకుగూడ తనకొడుకు బావిలోబడలేదని నమ్మకము కలిగెను. ఆ రాత్రి తల్లియు మేన మామయు నిద్రపోలేదు. రెండుజాములైన తరువాత వారి యింటిపొరుగుననున్న యొకబ్రాహ్మణుడిద్దఱు బాలకుల బట్టి తోడ్కొని వచ్చి యిందులో మీపిల్లవాఁడు, ఈ తోడిదొంగ లిద్దఱు జేసిన దుండగమిది. అంతే కాని నూతిలో బడలేదని చెప్పి వప్పగించెను. తల్లి గణపతిని జూచి "నాయనా! బ్రతికివచ్చితివా" యని కౌఁగిలించుకొని యేడ్చెను. మేనమామ గుండెబాదుకొని యెంత దుర్మార్గుడవురా నీ నిమిత్తము నాప్రాణమెంత యలజడి పడినదిరా? ప్రాణ నష్ట మటుండగా లోకములో నా కెంతో యప్రతిష్ట వచ్చినదని నేనెంతో కుళ్ళి యేడ్చుచున్నాను. సరే; నాయదృష్టము బాగుండబట్టి నీకు నూతిలో బడవలయు నని యిచ్చ లేకపోయిన దని తన చెల్లెలిని నుద్దేశించి "ఓసీ ! సింగమ్మా నీ కొడుకుతో నేను వేగలేను. నా యెముకలు చిట్లము కట్టి పోవుచున్నవి. వీనికోసము నేనెన్నో బాధలు పడియున్నాను. ఇకమీద నేను పడజాలను. అల్లరి పిల్లవాడై నప్పుడు కొట్టవలసి వచ్చును. మంద లించగానె నూతిలోపడి గోతిలోపడి చచ్చిపోవుదు నని బెదరించిన పక్షమున నే నెట్లు వేగ గలను. నేను కొంతకాలము మిమ్ములను సంరక్షించినాను. ఇక మీఁద మీ యిష్టము వచ్చిన చోటికి వెళ్ళి పొండు యని కఠినముగ బలి