పుట:Ganapati (novel).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

గ ణ ప తి

వైచిరి. ఆ చప్పుడేమిటని మేనమామ తల్లినడిగెను. అంతలో గణపతి సహాధ్యాయి యైన బాలుడు వచ్చి మీపిల్లవాడు నూతిలో బడినా డండోయియని కేకవైచి పారిపోయిను. మేనమామ భోజనమువదలి అయ్యో! అయ్యో ! యని లేచెను. సింగమ్మ అయ్యో కొడుకో, అయ్యో కొడుకో నేనేమి జేతునురా తండ్రీ యీ దిక్కుమాలిన చదువు నీ ప్రాణము కోసము వచ్చినదిరా తండ్రీ యని గుండెలు బాదుకొనుచు నేడ్చుచు మొత్తుకొనుచు దనయన్న గారిం దిట్టుచు బడిపంతులను దూషించుచు దైవమును దూఱుచు దన యదృష్టమును నిందించు కొనుచు నూతికడకు బోయి నూతి చుట్టు దిరుగు చుండెను. ఆ గోల విని చుట్టుప్రక్కలవా రందరు జేరిరి. మేనమామ తాళ్ళు దాగరలు నిచ్చెనలు మొదలైనవి సిద్ధము చేసి యీతనేర్చిన సాహసుల నిద్దఱను బాలుని వెదకుటకై నూతిలో దింపెను. ఎంత వెదకినను బాలుఁ డగుపడలేదు. ఊబిలో గూరుకు పోయి నాఁడని కొందదు పడగానె చేపలు తినివైచినవని కొందఱు బావిలో బాలుఁడు పడలేదని కొందఱు ననజొచ్చిరి. సింగమ్మ తానుగూడ నూతిలోదిగి చచ్చెదనని నూతియంచుపై గూర్చుండెను. అక్కడ నున్న వారందఱు పట్టుకొని యాత్మహత్య జేసికొన గూడచని మందలించి యిల్లుచేర్చిరి. పిల్లవాఁడేమై యుండునని మేనమామ తలపోయ జొచ్చెను. నిన్ను బెదరించుటకై కుఱ్ఱవాఁ డీయల్లరి చేసియుండును, కానికుఱ్ఱవాడు నూతిలో బడలేదని యక్కడ