పుట:Ganapati (novel).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

గ ణ ప తి

అమ్మవారి జాతరి యెల్లుం డనగా నేనప్పు డమ్మవారికి బలి నిమిత్తమై మేఁక కోసము తిరుగుచుండఁగా "వెంకన్న పంతులు గారు పోయినారు. మీరు మోతకు రావలసినద" ని నన్ను" నరిసిగాడు పిలిచి తీసికొనిపోయినాడు. మఱొక సంగతి "కంచరి కామాక్షిగారి పశువులపాక కాలిపోయినరోజండి" యని కొన్ని సంగతులు జ్ఞాపకము చేసెను. ఆ సంగతులనుబట్టి గణపతి యొక్క జన్మదినము జోగావధానులుగారికి స్ఫురింపలేదు. గొఱ్ఱగేదె లెవరు తెచ్చిరో యెప్పుడు తెచ్చిరో యాయనకు జ్ఞాపకము లేదు. ప్రాణము విసికి యెట్టకేల కాయన వెంకన్నపంతులుగా రెప్పుడు పోయినారో యాయన కొడుకు నడిగి తెలిసికొనిరా; దానిని బట్టి నెలమాసిక మెప్పుడైనదో పంచాంగము జూచి మీ పిల్లవాని జాతకము వ్రాసెదను. మూఁడు రూపాయలు మాత్రము తీసికొనిరా యని చెప్పి పంపెను. ఆ సాయంకాలముననె గంగాధరుఁడు మూడురూపాయల ముడుపు చెల్లించి వెంకన్నపంతులు గారి మరణదినము కుమారునడిగి తెలిసికొని వచ్చి చెప్పెను. మరునాడు సాయంకాలమునకె జాతకము వ్రాయఁ బడియెను. జాతకము తాటియాకు మీద వ్రాసి యది గంగాధరునకిచ్చి జోగావధానులు "గంగాధరుఁడూ ! నీవాఁ డఖండ ప్రజ్ఞావంతుఁడై దేశదేశములందు మహాప్రసిద్ధి కెక్కి నీ వంశమున కెంతో పేరుప్రతిష్ఠలు తెచ్చును. ఇంతకు నీయదృష్టము మంచిది. నీ పుణ్యముచేత నీకు సుపుత్రుడు కలిగినాడు. ఇటు