పుట:Ganapati (novel).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

121

"అయ్యా! నాకుమారుడు పుట్టిన మూడు నెలలకే మాయమ్మ చచ్చిపోయెను. వీఁడి మూలమున నింకెవరు చచ్చిపోవుదురు యని భయ మగుచున్నది. కాబట్టి వీని జాతకము వ్రాసి మీరెవ రెవరి కేమిగండము లున్నవో యేమి శాంతులు చేయవలెనో చెప్పవలె" నని యడిగెను. అనవుఁడు జోగావధానులు మీ పిల్లవాఁడు జన్మించిన తిథి, వారము, నక్షత్రము చెప్పిన పక్షమున జాతకము వ్రాసెదనని బదులు చెప్పెను. అన గంగాధరుఁడు తలయెత్తిపైకిచూచి కొంచె మాలోచించి వ్రేళ్ళుమడచి లెక్కపెట్టి "అయ్యా ! మావాఁడు పుట్టినరోజు సరిగా జ్ఞాపకము లేదు. ఉండండి. ఆలోచించి చెప్పఁగలను. వెంకన్నపంతులుగారి తల్లిగారి నెలమాసికము రేపనఁగా నా రాత్రి దీపాలవేళ నెట్టినాఁడు. నీ కేలాగున జ్ఞాపకమున్న దందురేమో వినండి. మరునాఁడు బ్రాహ్మణార్థమునకు రమ్మని వెంకన్నపంతులు గారు నన్ను పిలవవచ్చినారు. నా పెండ్లాము నొప్పులు పడుచున్నది. పురుఁడు రాకపోయిన పక్షమున రేపు రాఁగలను. వచ్చిన యెడల రానని చెప్పినాను. ఆయన వెళ్ళిపోయిన గడియలోనే వీఁడు జన్మించినాఁ" డని యతఁ డుత్తరము చెప్పెను. సరే వెంకన్నపంతులు గారెప్పుడు పోయినారో నీ వెఱుఁగుదువా? యని జ్యోతిష్కుఁ డడుగుటయు గంగాధరుడు తమ గ్రామములోని కెవరో తూర్పునుండి గొఱ్ఱగేదె లమ్మ దెచ్చినారే అప్పుడు; అదెప్పుడో చెప్పగలను. వినండి