పుట:Ganapati (novel).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

గ ణ ప తి

భాగ్యవంతునకు భూములున్న వానికి బ్రతిమాలి యెవరో యొకరు కాళ్ళు కడిగి వరదక్షిణనిచ్చి కన్యాదానము జేయుదురు. ఇటువంటి వానికి పిల్లనిచ్చుటయే యిచ్చుట. పిల్లమీద నాలుగువందలు పుచ్చుకొన్నప్పటికి మా కవి పెండ్లి కర్చులక్రింద సరిపోవును. అందులో మిగులునదిలేదు. మేము తిన్నదిలేదు. వట్టి యల్లరేకాని నాకిందులో లాభములేదు. ఒకవేళ పుచ్చుకొనుట దోషమైనప్పటికి వంశము నిలిపిన పున్నె మెక్కడిపోవును. వరుఁడా దిట్టమైనవాడు. కావలసినవాఁడు. మా పెద్దలు వాళ్ళ పెద్దలు గలసి యొక కుటుంబము లాగున నుండెడివారు. పెండ్లి కుమారునకు ముక్కు వంకర కన్ను వంకరలేవు. అన్నోదకము లిచ్చి యాలు బిడ్డలను బోషింపగల సమర్థుఁడు. సాంప్రదాయము మాట మనము వేరే నెంచుకొన నక్కఱలేదు. కాదాయెనంటె నీళ్ళుమోసి నాఁడా? దానికేమి, డబ్బులేనప్పు డేపనియైన జేయవచ్చును, అందుచేత నేను గంగాధరునకు నాబిడ్డను తప్పక యిచ్చెదను.

అనుకొన్నట్లు వివాహము జరిగెను. వివాహములో బెండ్లికూఁతురు మారము పెట్టి యరఁటిపండ్లు దిన్నందున జలుబుచేసి జ్వరమువచ్చి బాలపాపచిన్నె గనఁబడెను. కాని యగ్గిపెట్టెలు బొగచుట్టలు గంగాధరునియెద్ద నెప్పుడు సిద్ధముగ నుండుటచే నతఁడు బ్రహ్మాస్త్రమువలె పొగచుట్టదెబ్బ ప్రయోగించి భార్యను బ్రతికించు కొనియెను. పొగచుట్ట కాల్చుట దోసము కాదనియు నొకా నొకప్పు డది మహోప