పుట:Ganapati (novel).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

గ ణ ప తి

దీసికొనిపోయెను. ఆ సొమ్ము మరునాఁ డుదయమున నిచ్చితీరవలె. ఈయని యెడల దనకుఁ గాని దానికిఁ గాని మాట దక్కదు. పాపము! గంగాధరునకు గొప్పచిక్కు సంభవించెను. ఇదియా గొప్ప చిక్కని చదువరులు నవ్వుదురు గాబోలు. ఎవరిమట్టుకు వచ్చిన గాని వారికి తెలియదు. మీ కిటువంటిచిక్కు సంభవించునపుడు గాని మీకు తెలియదు. ఈ విషద్రోగమునకు మంచిమందేది యని గంగాధరుఁడు కొండొక సేపాలోచించి యిట్లునిశ్చయించెను. "నేనిప్పుడె బజారునకు వెళ్ళి కోమటి కోటయ్యవద్ద సీమనూలుజందెములజతకొని మెడలోవైచుకొని సంబావననిచ్చునట్టి దొడ్డికి వెనుకవైపుననున్న గొడ యెక్కి దొడ్డిలో దుమికి రెండవసారి సంభావనకు వెళ్లెదను. మొగ మానవాలు తెలియకుండ విభూతి పాముకొని యెదను, దీనితో మరియొక రూపాయ చేతఁబడును. పైమాట చూచుకొనవచ్చు" నని నిశ్చయించుకొన్నట్లు వెంటనే జరిగించెను. పదివందల రూపాయలు కర్చుపెట్టినను లభించుటకు దుర్లభమైన పెద్దజందెము గంగాధరునకు క్షణములో మంత్రములతోఁ బనిలేక నాలుగుడబ్బులతో లభించెను. అతని బుద్ధికుశలతకు చదువరులు సంతోషింతురని మా యభిప్రాయము. నూతన యజ్ఞోపవీతధారణమైన వెనుక విభూతి పాముకొని క్రొత్తపలుపు మెడనిడ్డ దున్నపోతువలె వెలయుచు నతఁడు దొడ్డి వెనుకకుఁబోయి వానదెబ్బచేత మదురూడి పోయిన భాగమున మెల్లఁగా గోడ యెక్కెను. ఈశ్వరుఁడు