పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతయు ఆయనయందే లీనమయ్యెను. దీనివలన షణ్ముఖుడే రమణుడని వ్యక్తమయ్యెను. నాయన భక్త్యావేశమున లేచి మహర్షిని కార్తికేయునిగా స్తుతించుచు 8 శ్లోకములను చెప్పి ఆ విధముగా తన గురువు యొక్క అవతార రహస్యము ప్రకటనమగుట తన గ్రంథ రచనకు ఒక ఫలమని, దానిచే గ్రంథము చరితార్థమయ్యెనన ఆనందించెను.

అప్పుడే వేలూరు నుండి కల్యాణ రాముడు వచ్చెను. పడైవీడులో పెద్ద చెరువు గట్టునొద్ద ఒక పొదలో తనకు మొండెము లేని ఒక శిరస్సు కనిపించెనని అది అనిబిసెంటు యొక్క శిరస్సును పోలియుండెనని అదియే అద్భుతమైన తేజస్సుతో రేణుకాదేవి శీర్షముగా స్ఫురించెనని అతడు చెప్పెను. మహర్షి రేణుకా తత్త్వము మంత్ర శాస్త్రములో ఎట్లున్నదని నాయనను అడిగి కుతూహలముతో వినెను.

కాశిలో నాయనకు దుర్గామందిర యోగియైన సుకేతుడు కన్పించినప్పుడు, తాము పదునార్వురు లోకకార్యము కొఱకు జన్మించితిమని, వారిలో గణకు డనువాడే గణపతియని, స్థూల శిరస్సువలన గణపతి కావింప దగిన కార్యమెట్టిదో తెలియగలదని చెప్పెను. ఆ స్థూల శిరస్సు రమణుడేయని నాయన గుర్తించెను. కాని ఇప్పుడు నాయన గణపతి యంశమున జన్మించెనని రమణుడు కార్తికేయుని యంశమున పుట్టెనని పై సంఘటనములచే వ్యక్తమయ్యెను. మఱి సుకేతుడు చెప్పిన మాటల కేమి అర్థము? ఆయన యభిప్రాయమును ఇట్లు గ్రహింపవచ్చును. ఈ పదు