పుట:Gaanaamritamu (1897).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఉపోద్ఘాతము.



న్నారాయణుం బ్రతిపాదించుచున్నది యని యుపనిషద్దేవి జ్ఞానధనుల యుల్లములకుఁదేఱి తెల్లముగాఁ దెల్పుచున్నది. మోక్షాపేక్షగల మానవుండభిమానము మాని శ్రీకృష్ణాభిధానుభగవానుఁ జిత్రచరిత్రసూచక చిత్రగానంబుల వినుతింప వలయునని భాగవతము "గాయన్విలజ్జోవిచరేదసంగ" అను వచనముచేఁ దెల్పుచున్నది. పశుశిశుసామాన్యమునకే చిత్తమునందు సత్వవృత్తింబాదుకొల్పు సంగీత విశేషంబు భగవద్ధ్యానపరాయత్తులగు వారిచిత్తముల సత్వవృత్తింబాదుకొల్పుట యొకవింతకాదు. పూర్వోక్తమగు నట్టిపరమేశ్వరారాధనంబున మునుమున్ను బాహ్యాలంబనములేక యంతరాలంబనము చేకూరనేరదు కావున నారంభములకు బాహ్యారాధనంబే ప్రధానభూతంబయి కానంబడుచున్నది. ఆ యంతరంగబహిరంగోపాసనలఁ జేయునపుడు వైరాగ్యభాగ్యముగల భక్తులు శాంతరసప్రధాన గానపచోరచనలఁ బ్రశాంతమగు పరమేశ్వరస్వరూపము నారాధించుచున్నారుః రాగాయత్తచిత్తులగు వారు శృంగారరసప్రధానము లయిన సంగీతవచనంబులచే పల్లవీవిలాసముల్లాసము నభినయించు శ్రీకృష్ణభగవానుని జగన్మోహనదివ్యరూపమును నుతించుచు సేవించుచున్నారు. అట్టియుపాసన చూపట్టనిచో రాగాబిభూతచేతస్కుల యుల్లంబులు పల్లవించి దైవంబనుమాటయేని పాటింప నేర్చునొక్కొ? రాగముతో దైవగానము సలిపిననయ్యది తదధిష్ఠానప్రభావముచే నేనాఁటికేని దైవనిష్ఠను సమకూర్పకమానదు. అగ్ని నాశ్రయించిన యయఃపిండంబునదావాకతాశక్తికలుగకమానునా? ఇక్కాలమున నెక్కడఁజూచినం బెక్కండ్రు రాగ ద్వేషాది దోషదూషిత చేతస్కులే గావున నట్టివారికి భక్తిరుచిచూపుట కది పరమయుక్తియని చెప్పనొప్పును. ఇమ్మాట చక్కఁగావిచారింపని వారిమానసమునకు వెక్కసముగాఁ దోఁచిన నది యుపాధిదోషముగాని వస్తుదోషముకా నేరదు. తత్త్వజ్ఞాన ఘనులగు మహనీయుల శ్రోత్రంబులకు శృంగారచరిత్రంబులును బరమార్థప్రతిపాదకములయి తోఁచుంగావునఁ దాదృశరసప్రతిపాదక గానవిశేషంబు పామరులకే యుపకారముగాని ప్రాజ్ఞులకుపకారము కాదని