పుట:Gaanaamritamu (1897).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

ఆర్యవర్యులారా!

సకలలోకములకుఁ దల్లియగు శ్రుతిసతీమతల్లి భయభయభ్రాన్తస్వాన్తులయిన తనపిల్లలనెల్లరఁ గరుణాకటాక్షమున రక్షింపఁగోరి వారివారి యధికారమునకుఁ దగువిధముగా ననేకముఖంబుల నిరతిశయానన్దకన్దమగు మోక్షమునకు సాక్షాత్సాధనమగు జ్ఞానయోగంబును బరంపరాసాధనంబులగు కర్మయోగభక్తి యోగంబులును బరమాదరంబున నుపదేశించుచున్నది. అందువలన మనుజులందఱును దమకు రుచించిన మార్గముల నవలంబించి యపవర్గమున కభిముఖులయి మెలంగుట కవకాశము కల్గుచున్నది. భూతలంబునఁ గేవలజ్ఞానయోగులైన యుత్తమాధికారులు కోటికొక్కరు నూటికొక్కరుగానుందురు. తక్కినవా రందఱును మధ్యమాధికారులుగాను మందాధికారులుగానుందురు. కావున వారికిఁ గర్మయోగ భక్తియోగములే ప్రధానంబులయి చూపట్టుచున్నవి. అందునుఁ గలియందలి మానవులనేకులు కేవలము మందాధికారులు గావున వారికి ముక్తి సాధనములలోని భక్తియోగమే ప్రధానభూతంబయి కానంబడుచున్నది. పరమార్థంబగు పరతత్త్వంబు నిరుపాధికంబయ్యును సోపాధికంబుగాఁ దక్కమఱి యొక్కవిధముగా నారాధింప నశక్యంబగుటంబట్టి భక్తియోగాసక్తిగల కొందఱు నామధేయరూపధేయ మయంబులయి శుభవిధాయకములయిన యుపాధుల నాధారముగఁజేసికొని హరిహరాది దివ్యమూర్తులను భవ్యవచనరచనల సంగీతభంగి ననుసరించి యంతరంగ బహిరంగంబుల నుతించుచు సేవించుచున్నారు. సామవేద నిదానంబై నామరూపాత్మక సప్తవిధ స్వరవర్ణస్వరూపంబగు గానంబు వీణాదిసాధనముఖంబుల వర్తిల్లుచు మార్తాండమండలాంతర్వర్తియగు శ్రీమ