పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

ఏడవ అధ్యాయము


వ్యాపకమునకడ్డుకలుగ జేయ యత్నించెను. ఈ సంగతి రాజ మాత కిష్టము లేక తిరిగి మత యుద్ధము కల్పించు తలంపుతో కొందరు రోమను కాథలిక్కు ప్రభువుల సహాయమున నామె 1572 సంవత్సరము - 24 వ ఆగస్టు తేదీన రోమను కాథలిక్కు ప్రజల నావేశ పరచి వారిచే పరాసు దేశములోని పది వేల మంది ప్రొట స్టెంలను హత్య గావించినది. పరాసుదేశము లోని పొప్రొటస్టెంటులకు “హ్యుజినాట్లు” అని పేరు. ప్రొటెస్టం ట్లు ఆత్మసంరతణకొఱకై తిరిగి యుద్ధము ప్రారంభించిరి. యుద్ధ ములు సాగుచుండెను. తొమ్మిదవ చార్లెసు చనిపోయెను. మూడవ హెన్రీ రాజ్యము చేయుచుండెను. ఈయనకు సంతతి లేదు. ఈయనత ర్వాత వారను ప్రొటెస్టెంటుకక్షికి నాయకు డగు నా వరు ప్రభువగు 'హెన్రీ అయియుండెను. హెన్రీ వార నుగాకుండ నుండుటకై రోమసు కాథలిక్కుకక్షివారు పట్టు పట్టిరి. ఇందువలన యుద్ధము తీవ్రమయ్యెను. మూడవ హెన్రీ రాజు నొక మతగురువు పొడిచిచంపెను. తర్వాత వారసును, నావ రు ప్రభువును నగు 'హెన్రీనాలుగవ హెన్రీరాజసు బికుదమును ధరించెను. ఈయన ప్రొటెస్టెంటు మతస్థుడగుటవలన రోమసు కాథలిక్కు ఫాస్సు ఈయనను రాజుగ నంగీకరించలేదు. రెండు సంవత్సరములు తన సైన్యములతో రోమును కాథ లిక్కులను జయించి లోబరుచుకొన యత్నించెను. రోమసు కాథలిక్కులకు స్పెయిను రాజు సహాయము చేయుచుండెను. స్పెయిసు రాజు పరాసు రాజ్యము నాశించెను. ఇంతలో 1593 సంవత్సరమున నాలుగవ హెన్రీ పోటెస్టెంటు మతమును వదలి