పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
80

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

మున బోర్బాన్" ప్రభువులు కాల్విన్ మతస్థులుగను, గైజుప్రభు వులు రోమను కాథలిక్కులుగను నుండిరి. రాజు యొక్క ప్రధాన మంత్రి యగు లహాపిటలు మత సహనమును పహించి కొన్ని, నిర్బంధములకు లోబడి ప్రొటస్టెంటుల ఆరాధన జరుగవచ్చునని శాసించెను. ఇది గైజు ప్రభువున కిష్టము లేదు. 1562 సంవత్సర ము మార్చి నెలలో తన సేనలతో బయలుదేరి వాసీయను చిన్న పట్టణమున జరుగుచున్న కాల్విన్ మతస్థుల యారాధ నను బలవంతముగా చెదరగొట్టి అనేకుల 'ప్రొటెస్టెంటు లను వధించెను, ఇందుమీద ప్రొటెస్టెటుల పక్షమువ బోర్బాన్ ప్రభువులు కత్తిదూసిరి. ఇంక ననేకులు ప్రభువు లిరు పక్షములను చేరిరి. ముప్పది సంవత్సరముల వరకును పరా సు దేశములో రోమను కాథలిక్కులకుసు ప్రొటస్టెంటులకును యుద్ధములు జరిగెను. చాలవరకు రోమసు కాథలిక్కులకే జయ ములు కలిగెను. ఇంగ్లండు, జర్మనీ, స్విడ్జర్లెండు దేశముల కులు ప్రొటెస్టెంటులకు సహాయమునంపగ స్పెయిను రాజు రోమ నుకాథలిక్కులకు సహాయము చేసెను. 1570 సంవత్సరమున నొక సంధి జరిగెను. పొటెస్టెంటు మతము నిచ్చవచ్చిన వారప లంబించ వచ్చునని సంధివలన నిర్ణయించబడెను. తొమ్మి దవ చార్లెసురాజు యుక్త వయస్కుడై ఈ అంతర్యుద్ధమువలన తన దేశము క్షీణించిపోవుచున్నదనియు తన శత్రువగు స్పెయి సు అభివృద్ధి చెందుచున్న దనియు గ్రహించి తాను రోమను కాథలిక్కు మతస్థుడయ్యును ప్రొటెస్టెంటులగు ఇంగ్లాండు రాణి తోను హాలెండు ప్రజలతోను స్నేహము చేసి స్పెయిను యొక్క