పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

ఏడవ అధ్యాయము


చేరిరి. పరాసుదేశములోని దక్షీణపశ్చిమ భాగములు రోమను క్యాథలిక్కు మతమును విడిచి మాతన మతముసవలం బించెను. ఇదికూడ ప్రొటెస్టెంటు మతములో శాఖయే. ప్రొటెస్టెంటు మతములో నెన్నియో శాఖలుగలవు. పరాసు దేశములో ప్రొటెస్టెంటు మత మింకసు వ్యాపించి యుండును గాని రోమసు కాథలిక్కు మతములో ననేక సంస్కరణలు జరిగి, వారి యరాధన, జీవితము ఎక్కువ స్వచ్ఛమయినదిగ చేయబడి, మూఢ నమ్మికలు తోసివేయబడి ప్రజలను ప్రొటెస్టెంటు మత మునవలంబించ కుండ నాకర్షించిరి. ప్రాస్సు దేశములోని యధిక సంఖ్యాకులగు ప్రజలు రోమసు కాథలిక్కులుగనే యుండిరి. రోమను కాథలిక్కు లిష్పటికీని రోములోని పోవు యొక్క పీఠ ముసకు లోబడి విగ్రహారాధకులై యున్నారు. పొటెస్టెంటుల నమ్మికలను బలవంతముగా నణచివేయు ప్రయత్నముల వలన మనస్సాక్షి కొరకు బాధల నొందు వారియందు ప్రజలలో గౌర వము కలిగి ప్రొటస్టెంటు మతము ఎక్కువగా వ్యాపించెసు. ఇందుకు మారుగా రోమను కాథలిక్కు మతములో సంస్కరణము సు గావించి యారాధనను, జీవితమును ఎక్కువ యుత్కృష్టమయి సదిగా చేయుటవలన మాత్రమే రోమను కాథలిక్కు మతము సంరక్షింపబడి ప్రొటెస్టెంటు మతవ్యాపన యూరఫుఖండములో నరి కట్టబడినది.


రెండవ 'హెన్రీ చనిపోయిన తరువాత తొమ్మిదవ చార్లెసు రాజ్యమునకు వచ్చెను. ఈయన చిన్న వాడై నందున రాజమాతయగు కాథరిన్ డి మెడిసి పాలనము చేసెను. ఈ కాల