పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
79

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

పొడిచి చంపెను. హాలెండు ప్రజ లిన్ని కష్టముల మధ్య సహన ముతో పోరును సాగించిరి. విలియం యొక్క కుమారుడగు మారిసు హాలెండు ప్రజలకు నాయకత్యమును వహించెను, కొంతకాలమునకు "స్పయినుకు శత్రువులగు ఫ్రాన్సు ఇంగ్లాండు రాజులు హాలెండు ప్రజల సహాయమునకు వచ్చిరి, స్పెయినువా రోడిపోయిరి. 1600 వ సంవత్సరమున 'స్పెయిను రాజు హాలెండు ప్రజలస్వాతంత్యము సంగీక రించి సంధి చేసుకొనెను. ఈపోరా టములో హాలెండు ప్రజలు స్పెయినువారికి పోటీగ పడవలను నిర్మించి సముద్రముల మీద ప్రయాణములు చేసి ఆసియా తోను అమెరికాలోను వర్తకమునందు ప్రథాన స్థానమును పొం దిరి. స్పెయిను నుండి స్వాతంత్యమును పొందిన తరువాత హాలం డులో రాజరికపు కక్షియు ప్రజాస్వామ్య కక్షియు నను రెండు కక్షలు కొంత కాలమువరకు తగవులాడి రాజరికపుకక్షవారు ప్రాబల్యమును పొంది, విలియం ఆఫ్ ఆరెంజి వంశ్యులు స్టాడ్టు "హెూల్డరు అను పేరుతో నొకవిధమగు రాజులయిరి.

(5)

ఫ్రాన్సు దేశములో
మత కలహములు

ఫ్రాన్సు దేశమున ఏడవ హేన్రీరాజు ప్రొటెస్టెంటు మతము పై నిర్భంధ విధాన మవలంబించి ప్రొట సైంటులయిన వారిని చంపి వేయుచు, ఆమతము తన దేశములో వ్యాపించకుండ జేసెను. కాని ఫ్రాన్సు దేశములోనే కాల్విను అను మత సంస్కర్త బయలు దేరి ఫ్రెంచి భాషలో గ్రంథములసు వాసెను. ఫ్రెంచి ప్రజలలో సంస్కరణము వ్యాపించ జొచ్చెను, పరాసు ప్రభువులలో ననేకు లీమతములో ,